Breaking News

ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకల్లో అందరూ భాగస్వాములు కండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అన్నారు కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం. బుధవారం ఉదయం శతాధిపతులతో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఏర్పాట్ల పై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో జూన్ 5, 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ లో మూడు నియోజకవర్గాల్లో జరిగే అవగాహన, మొక్కలు నాటే కార్యక్రమాల పై అధికారులతో సమక్షించారు.

ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన అంశం ప్లాస్టిక్ నిర్మూలన అని, దానికనుగుణంగా ప్రజల నుండి ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించి ప్రజలకు క్లాత్ బ్యాగులు ఇవ్వాలని, ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్ధాలు గురించి వారికి తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని, కాలుష్యాన్ని తగ్గించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.

ప్లాస్టిక్ సేకరణ కొరకు ” ఫ్యాబ్రిక్ ఇన్ – ప్లాస్టిక్ అవుట్” స్టాల్స్ ని ఏర్పాటు చేయాలని, అధికారులను ఆదేశించగా, అధికారులు 7 ప్రదేశాలలో ఏర్పాటు చేస్తున్నారని, శ్రీ కనకదుర్గమ్మ గుడి, పూల మార్కెట్, కాలేశ్వర రావు మార్కెట్, విజయవాడ నగరం పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్, సాంబమూర్తి రోడ్ రైతు బజార్, పటమట రైతు బజార్ వద్దా స్టాల్స్ ని ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి గుడ్డ సంచులను ప్రజలకు అందిస్తారని తెలిపారు.

పశ్చిమ నియోజకవర్గం లో హెచ్ బి కాలనీ కరెంట్ ఆఫీస్, పాయికాపురం చెరువు మరియు లయోలా కాలేజ్ రోడ్డు వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రజలు ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు విస్తృతంగా చైతన్య పరిచే విధంగా ఏర్పాటు చేస్తున్నారని, ప్రజలు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *