-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ ఎం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిషాకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ ఎం, బీఆర్‌టీఎస్ రోడ్ నిర్మాణం, ఎర్రకట్ట రోడ్ విస్తీర్ణ పనులపై ప్రస్తుత స్థితిగతుల వివరాలు ఇచ్చారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కమిషనర్ ఆయా ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుణదల నుంచి సత్యనారాయణపురం వరకు ఉన్న బీఆర్‌టీఎస్ రోడ్డును రైల్వే స్టేషన్ వరకు పొడిగించేందుకు అవసరమైన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న రోడ్డుపై స్పష్టత, రైల్వే అధికారుల భాగస్వామ్యంతో చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. రైల్వే సమన్వయంతో ఈ రోడ్డును పూర్తిచేస్తే, రైల్వే స్టేషన్ వరకు మెరుగైన రహదారి కనెక్షన్ లభిస్తుందని పేర్కొన్నారు.
తదుపరి, ఎర్రకట్ట వద్ద రానున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్, విస్తీర్ణం పనుల్లో ప్రభావితమవుతున్న ఇళ్ల వివరాలపై అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఇన్చార్జి చీఫ్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు డా. బాబు శ్రీనివాస్, డా. అన్నపూర్ణ, డిప్యూటీ సిటీ ప్లానర్ సుభాష్ చంద్రబోస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సురేఖ, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News