Breaking News

ఓటేరు పంచాయతీ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

-సచివాలయం సిబ్బంది పింఛన్లు క్రమం తప్పకుండా ప్రతి నెల లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం లక్ష్యంగా…ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దకు వెళ్ళి క్రమం తప్పకుండా పింఛన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఉదయం తిరుపతి రూరల్ ఓటేరు పంచాయతీ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసి పలువురు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ జిల్లాలో సచివాలయ సిబ్బంది ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు. జిల్లాలో జూన్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల ను 2,59, 732 మంది ఫించన్ దారులకు సుమారు 111.45 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఇంటింటికి వెళ్లి పెన్షన్ లను అందజేస్తూ పెన్షన్లు అందిస్తున్న తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతినెల ఒకటవ తేదీన మీ ఇంటి వద్ద కు వచ్చి పెన్షన్ల పంపిణీ చేస్తున్నారా అని లబ్ధిదారులను అడిగారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే తమ ఇంటి వద్దకు వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని ఫించన్లు తమకు ఆర్థికంగా భరోసా ఉందని కలెక్టర్ కు తెలిపారు. తిరుపతి రూరల్ ఓటేరు గ్రామ పంచాయితీ నందు మునెమ్మ వృద్ధాప్య పెన్షన్ రూ.4000, వితంతు పెన్షన్ కింద ఈశ్వరీ సుబ్రహ్మణ్యం రూ.4000 ను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి అందచేశారు. దేశంలో ఎక్కడా లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను పేదలకు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందిస్తున్నారని కలెక్టర్ లబ్ధిదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పి డి శోభన్ బాబు, ఎంపిడిఓ రామచంద్ర, సచివాలయం సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *