శాసన సభ ప్రాంగణంలో ప్రకాశం పంతులు జయంతి వేడుకలు…


-ఘనంగా నివాళులు అర్పించిన శాససభ కార్యదర్శి పి.బాలకృష్టమాచార్యులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు 150 వ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు జరిగాయి. శాసన సభ కమిటీ సమావేశ మందిరంలో శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్టమాచార్యులు, ఇతర అధికారులు, సిబ్బంది అంతా సమావేశమై టంగుటూరి ప్రకాశం పంతులు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్టమాచార్యులు మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవిన్యూ మంత్రిగా మరియు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన టుంగుటూరి ప్రకాశం పంతులు గొప్ప దేశభక్తుడని, నిర్బయత్వానికి, నిస్వార్థానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవిన్యూ మంత్రిగా పనిచేస్తూనే రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ 1937 లో ఇచ్చాపురం నుండి తడ వరకు రైతుపాదయాత్ర నిర్వహించి జమిందారీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసిన గొప్ప దేశభక్తుడన్నారు. జమిందారీ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రతిపాదించిన బిల్లును ఉమ్మడి మద్రాసు రాష్టంలో ఆయనే ప్రవేశపెట్టారని, స్వాతంత్ర్యానంతరం అది అమల్లోకి వచ్చిందన్నారు. ఆంద్ర రాష్ట్ర అసెంబ్లీలో సభాపతిని ‘సర్’ అంటూ సంభోదిస్తూ సభాపతి స్థానానికి గొప్ప గౌరవాన్ని ఆపాదించిన మహోన్నత వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారని ప్రశంశించారు. విధి, విధానాలతో కాలయాపన చేయకుండా వాటిని అనుసరిస్తూనే సత్వరంగా పనిని సకాలంలో ఏ విధంగా నిర్వహించాలో చేసిచూపించిన గొప్ప ప్రజా సేవకుడని కొనియాడారు.
శాసన సభ ఉప కార్యదర్శి ఎం.విజయరాజు తో పాటు శాసన సభ విభాగం అధికారులు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *