జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను తెలియజేశారు. సోమవారం జగ్గయ్యపేట పట్టణంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అగ్రి గోల్డ్ డిపాజిటర్లు తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారని, వారి బాధను, ఆవేదనను అర్థం చేసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి రాగానే 2019–20 బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు కేటాయించడం జరిగిందని, రూ.10 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లించేందుకు రూ.263.99 కోట్లు విడుదల చేయడంతోపాటు 94 శాతం మందికి చెల్లించేలా చర్యలు తీసుకున్నారన్నారు. రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి సైతం డబ్బు చెల్లించేందుకు వీలుగా హైకోర్టు అనుమతి తీసుకుని ఆగస్టు 24న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 14 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 500 కోట్లను చెల్లించడం జరుగుతుందన్నారు. అగ్రిగోల్డ్ లో 300 మంది బాధితుల ఆత్మహత్యలకు ప్రత్యక్ష కారకుడు చంద్రబాబు నాయుడు అని, అగ్రిగోల్డ్ పాపం లక్షలాది ప్రజలకు శాపంగా మారడానికి ప్రధాన కారకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేశారు. అప్పటి ముఖ్యమంత్రి హోదాలో బాధితుల పక్షాన నిలవాల్సిన చంద్రబాబు అగ్రిగోల్డ్ యాజమాన్యంతో లోపాయికారి ఒప్పందం చేసుకొని అగ్రిగోల్డ్ బాధితుల నెత్తిన శఠగోపం పెట్టారని ధ్వజమెత్తారు. గతంలో అగ్రి గోల్డ్ సంస్థ 32 లక్షల మంది డిపాజిటర్ల నుంచి రూ.6,380 కోట్లు సేకరించి మోసం చేసిందని, బాధితులకు ఏపీ ప్రభుత్వం ముందుగానే చెల్లింపులు చేసి, హైకోర్టు నియమించిన జిల్లా స్థాయి కమిటీల ఆధ్వర్యంలో అగ్రి గోల్డ్ ఆస్తులను అమ్మగా వచ్చిన డబ్బును ప్రభుత్వం తిరిగి తీసుకునేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలియజేశారు
Tags jaggaiahpeta
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …