-బొమ్మూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు 8977935611
-ఆర్డీవో రాజమండ్రి 0883 – 2442344
-ఆర్డీవో కొవ్వూరు 08813- 231488
-24 x 7 పర్యవేక్షణ కోసం ప్రత్యేక చర్యలు
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తర ఆంధ్రప్రదేశ్ & దక్షిణ ఒడిశా తీరానికి సమీపంగా అల్పపీడనం ఏర్పడటంతో, ఆగస్టు 13 నుండి 14 వరకు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు, ఆమేరకు క్షేత్ర స్థాయిలో తగిన చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. బుధవారం రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, సిసిఎల్ఏ కమిషనర్ జి జయలక్ష్మి లు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా జిల్లా కలెక్టర్ లకు ముందస్తు చర్యలు పై సూచనలు చేయడం జరిగింది.
స్థానిక కలెక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వాతావరణ హెచ్చరికలు నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బొమ్మూరు కలెక్టరేట్‌లో, అదే విధంగా రెండు డివిజన్ మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. బొమ్మూరు కలెక్టరేట్ లోజిల్లా కంట్రోల్ రూమ్ నంబర్: 8977935611 ద్వారా 24 x 7 మూడు షిఫ్ట్ ల్లో సిబ్బందిని నియమించి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియ చేశారు.
రాజమండ్రి, కొవ్వూరు డివిజన్ పరిధిలో కూడా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆర్డీవో లను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. అన్ని మండల కేంద్రాలలో అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లా యంత్రాంగం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆర్డీవో రాజమండ్రి 0883- 2442344, ఆర్డీవో కొవ్వూరు 08813- 231488 కంట్రోల్ రూమ్ నెంబర్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News