అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆయుర్వేద, హోమియో, యునాని మందుల తయారీ యూనిట్లు, దుకాణాల నిర్వహణ రెన్యువల్స్ కోసం ఆయుష్ శాఖ తొలిసారిగా ప్రత్యేక మేళాలను రాష్ట్రంలో నిర్వహించడం ప్రారంభించింది. ఈనెల 25నుండి మలి విడత మేళాలను నిర్వహించనున్నట్లు ఆయుష్ శాఖ డైరెక్టర్ కె.దినేష్ కుమార్ నేడొక ప్రకటనలో తెలిపారు. ఆయుష్ శాఖ అడిషనల్ డైరెక్టర్లు, డ్రగ్ ఇన్ స్పెక్టర్లు, సహాయక సిబ్బంది ఆయుష్ మేళాకు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన తయారీ యూనిట్లు, దుకాణాల యజమానులు, విక్రేతలు ఏలూరులోని ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో ఈనెల 25, 26 తేదీల్లో, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు ఆయుష్ రీజనల్ డిప్యుటీ డైరెక్టర్, ఓల్డ్ రిమ్స్ హాస్పిటల్, గవర్నమెంట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్, ప్రకాశం భవన్ ఎదురుగా, ఒంగోలు చిరునామాలో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో, ఉమ్మడి కర్నూలు, వైయస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల వారు ఆయుష్ రీజనల్ డిప్యుటీ డైరెక్టర్ కార్యాలయం, ఓల్డ్ రిమ్స్ , 8-రోడ్స్ దగ్గర, కడప చిరునామాలో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో హాజరుకావాలని ఆయుష్ శాఖ డైరెక్టర్ కోరారు.
లైసెన్స్‌లు రెన్యువల్ చేయడంతో పాటు వారివారి సమస్యల పరిష్కారం కోసం ఈ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Prajavartha Online Telugu News