-కుప్పంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన
చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కుప్పం నియోజకవర్గంలోని చివరి చెరువు అయిన పరమస ముద్రంచెరువునందుహంద్రీనీవా పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. బుధవారం కుప్పం నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరమ సముద్రం చెరువు వద్ద జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హంద్రీ-నీవా జలాలతో కుప్పం నియోజకవర్గంలోని 430 చెరువులు నింపనున్నారు. ఈ నేపథ్యంలో చెరువుల సామర్థ్యం, చెక్ డ్యాంలను బాగు చేయడం, నీటినిల్వలో ఎలాంటి లోపాలు ఉండకుండా ముందస్తుచర్యలుతీసుకోవాలని ఇంజనీర్లు ఆదేశించారు. త్వరలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని తెలిపారు. పరమ సముద్రం చెరువు నందు బహిరంగ సభ, జల హారతి,
పైలాన్ ఆవిష్కరణకార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సంబంధిత ఇంజనీర్లు అందరూ జాగ్రత్తగా మీ విధులు నిర్వహించాలని ఆదేశించారు కార్యక్రమంలో ఎన్టీఆర్ తెలుగు గంగా ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎమ్ ఎల్ ఎన్ వరప్రసాద్, హెచ్ ఎన్ ఎస్ ఎస్ ఎస్ ఈ విటల్ ప్రసాద్, కుప్పం హెచ్ ఎన్ ఎస్ ఎస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే గోవర్ధన గిరిధర రావు, రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ రామచంద్రారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News