-1100 కాల్ సెంటర్ – ప్రజా ఫిర్యాదుల పరిష్కార సమాచారం
-9552300009 వాట్సాప్ గవర్నెన్స్ – పౌర సేవల కోసం సులభ మార్గం
-జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్ కార్యక్రమం అక్టోబర్ 13వ తేదీ సోమవారం యథాతధంగా నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రానికి రాకుండా తమ డివిజన్, మండల కార్యాలయాలు, గ్రామ/వార్డు సచివాలయాల్లోనే అర్జీలు అందజేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదుల సమర్పణకు 1100 టోల్‌ఫ్రీ నంబర్ లేదా meekosam.ap.gov.in వెబ్సైట్ ఉపయోగించవచ్చని ఆమె తెలిపారు. అదేవిధంగా ఫిర్యాదు పరిష్కార స్థితి తెలుసుకోవడానికి 1100 (డబుల్ వన్ డబుల్ జీరో) నంబర్‌కు కాల్ చేయవచ్చని, అలాగే ప్రభుత్వ పౌర సేవల కోసం 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ ను వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు.
Prajavartha Online Telugu News