Breaking News

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌లో బీసీ సంక్షేమం

-చేనేత–లేపాక్షి రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-బీసీ హాస్టల్స్‌లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి
-మంత్రి ఎస్‌. సవిత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో బీసీ హాస్టల్స్‌లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే దిశగా చర్యలు వేగవంతమవు తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి శ్రీమతి ఎస్‌. సవిత తెలిపారు. ఆదివారం స్థానిక ప్రవేటు సమావేశ మందిరంలో (షెల్టాన్ హోటల్‌) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బీసీ సంక్షేమ, చేనేత, జౌళి , లేపాక్షి శాఖ అధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ సంక్షేమం, విద్యా వసతుల మెరుగుదల బీసీ హాస్టల్స్‌లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. “సామాజిక బాధ్యత కింద సిఎస్‌ఆర్‌ భాగస్వామ్యం ద్వారా బీసీ హాస్టల్స్ అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సదుపాయాలు నిరంతరంగా అందించాలి” అని సూచించారు. “దోమలు రాకుండా మెస్‌లను శుభ్రంగా నిర్వహించాలన్నారు. వేడి చల్లార్చిన నీరు, తాజాగా వండిన ఆహారం మాత్రమే విద్యార్థులకు అందించాలన్నారు. విశ్రాంతి గదులు, తరగతి గదులు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ఆహారం తీసుకురావద్దని మంత్రి ఆదేశించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బీసీ వర్గాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి ఎస్‌. సవిత పేర్కొన్నారు. బీసీ వర్గాల ఆర్థిక, సామాజిక, విద్యా స్థాయిని పెంచే దిశగా ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతుందని తెలిపారు. చేనేత, లేపాక్షి, అప్కో సంస్థల ద్వారా బీసీ వృత్తివర్గాలకు మార్కెట్‌ లింకులు కల్పించడం, విక్రయాలు పెంచడం, స్వయం ఉపాధికి ప్రోత్సాహం ఇవ్వడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని వివరించారు. బీసీ విద్యార్థుల విద్యా భవిష్యత్తు సుస్థిరం కావడానికి వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడమే కాకుండా, ఆరోగ్యం, భద్రత, నాణ్యమైన విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు.

“ప్రతి వసతి గృహం, గురుకుల పాఠశాలలో సీసీ కెమెరాలు, మినరల్ వాటర్ ప్లాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. విద్యార్థుల తల్లిదండ్రులు వారితో మాట్లాడేందుకు కాయిన్ ఫోన్ సౌకర్యం కూడా కల్పించామన్నారు.

మధ్యాహ్న భోజన పథకం అమలు, వసతి గృహాల పరిశుభ్రతపై మాట్లాడుతూ, “వసతి గృహాల్లో ఉన్న విద్యార్థు లను మన పిల్లలుగా భావించి, ప్రతి అధికారి బాధ్యతగా చూడాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు తరచూ గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు, హాస్టల్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించాలనీ సూచించారు. వాతావరణ మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.”

 

 

“తల్లితండ్రులు ఎంతో విశ్వాసంతో పిల్లల్ని హాస్టల్స్‌కు పంపుతున్నారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత. పిల్లల విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు.

చేనేత, లేపాక్షి రంగాలపై మాట్లాడుతూ “ఆప్కో, లేపాక్షి విక్రయాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అప్కో లో రెడీమేడ్ వస్త్రాలు కూడా అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందనీ, మేక్ ఇండియా – మేడ్ ఇండియా దిశగా స్వదేశీ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం, అలవాటుగా మార్చుకోవడం లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. నాణ్యమైన లేపాక్షి ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రదర్శించి, ప్రచారం కల్పించాలన్నారు. హ్యాండ్లూమ్, టెక్స్టైల్ రంగాల్లో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలను లబ్ధిదారులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో పథకాల అమలులో మరింత వేగం అవసరం” అని తెలిపారు. ఆ క్రమంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 16 అప్కో షాప్స్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, ఆంధ్రప్రదేశ్ బీసీ కోఆపరేటివ్ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి బి. శశాంక, బీసీ కార్పొరేషన్ ఇ.డి. శ్రీనివాస్, ఆప్కో జీఎం కే. పెద్దిరాజు, ఏబీసీడబ్ల్యూఒ ముత్యాల సుబ్బారావు, లేపాక్షి అధికారులు, మూడు జిల్లాల ఇతర క్షేత్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *