Breaking News

ఉద్యమాల బాట పట్టక ముందే ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామిలను అమలు చేయాలి…

-రిటైర్డ్ ఉద్యోగులకు రావల్సిన బకాయిలు కోసం ఎదురుచూస్తూనే చాలా మంది చనిపోతున్నారు
-చట్టబద్ధంగా నియమించాల్సిన పిఆర్శీ కమిటీ, సకాలంలో విడుదల చేయాల్సిన డిఏలు, వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా, కనీసం ఐఆర్ కూడా ఇవ్వకుండా ఉద్యోగులను బాధ పెట్టడం మంచిది -అన్ని కార్యాలయాల్లో క్లాస్ – iv ఉద్యోగుల ఖాళీలను భర్తిచేయాలి
-కొత్తగా ఏర్పడ్డ 13 జిల్లాల్లో కూడా క్లాస్ iv అసోసియేషన్ జిల్లా కార్యవర్గాలు ఏర్పాటు చేసి, సంఘాన్ని మరింత పటిష్ట పరచాలని తీర్మానం
-బొప్పరాజు/ఎస్.మల్లేశ్వరరావు/తోట చెన్నప్ప డిమాండ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగ సంఘాల జేఏసీకి ఏపి ప్రభుత్వ నాల్గోవ తరగతి ఉద్యోగుల ఎంప్లాయీస్ అసోషియేషన్ చాలా కీలమైనదనీ, అలాంటి క్లాస్ 4 ఎంప్లాయీస్ అసోషియేషన్ ఏపిజేఏసి అమరావతి లో భాగస్వామ్యం గా ఉన్నదని, నాల్గవ తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ఏపి జేఏసి అమరావతి అండగా ఉంటుందని ఏపి జేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హామిఇచ్చారు. ఆదివారం గుంటూరు లో జరిగిన ఏపి క్లాస్ 4 ఉద్యోగుల అసోషియేషన్ రాష్ట్ర కార్యవర్గసమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యస్.మల్లేశ్వరరావు అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శితోట చెన్నప్ప ఆద్వర్యంలో జరిగింది.

ఈసమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గోన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేడు ఉద్యోగులంతా కోరుకున్న కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారం లోకివచ్చింది గాని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల ముందు ఇచ్చిన హామిలను ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా సరే ఇచ్చిన హామీలు నేటికి అమలు చేయని కారణంగా ఉద్యోగులంతా నిరుత్సాహంగా ఉన్నారు.

అంతే కాకుండా రిటైర్ అయిన ఉద్యోగుల గ్రాడ్యూటీ, లీవ్ ఎన్ క్యాష్ మెంటు డబ్బులు బకాయిలు తీసుకోకుండానే చనిపోతుండడం చాలా బాదాకరంగా ఉందని, ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సబ్యులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించడింలేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామిలలో ప్రధానంగా ఐఆర్ ప్రకటించి, తక్షణమే 12 వ పీఆర్శీ కమీషనర్ ను నియమించాలనీ, గత రెండు సంవత్సరాలుగా రావాల్సిన నాలుగు డి ఏ లు విడుదల చేయాలని, అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలని, ఇ.హెచ్.యస్ ద్వారా క్యాష్ లెష్ ట్రీట్ మెంటు ఇప్పిస్తారని ప్రతి పండగకు ఉద్యోగులు గత సంవత్సరం కాలంగాఎదురుచూస్తూన్నారే గాని ప్రభుత్వం నుండి ఒక్కరూపాయి కూడా రాకపోవడంతో ఉద్యోగులలో ఉన్న ఆందోళణలను, బాధను దృష్ట్రా పెట్టుకొని తదుపరి నిర్వహించబోయే ఏపి జేఏసి అమరావతి రాష్ట్రకార్యవర్గంలో ఒక నిర్ణయం తీసుకొని భవిష్యత్ కార్యక్రమాలను ప్రకటిస్తామని బొప్పరాజు తెలియజేసారు.

క్లాస్ iv అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.మల్లేశ్వర రావు మాట్లాడుతూ ఇప్పటికీ రాష్ట్రంలో 13 జిల్లాలు + 1 అదనపు యూనిట్ మొత్తం 14 జిల్లా యూనిట్లకు జిల్లా కార్యవర్గాలు ఉన్నాయని, రానున్న రెండు మాసాల్లో కొత్తగా ఏర్పడ్డ 13 జిల్లాల్లో కూడా జిల్లా కార్యవర్గాలు ఏర్పాటు చేసుకుని, ఉద్యోగుల దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి రాబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎటువంటి కార్యాచరణ చేపట్టినా రాష్ట్ర క్లాస్ iv అసోసియేషన్ సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.

ఈసమావేశంలో ఏపిజేఏసి అమరావతి స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, స్టేట్ ఉమెన్ కమిటి చైర్ పర్సన్ పారే లక్ష్మి, సిటీ జేఏసి ప్రధానకార్యదర్శి మందపాటి శంకరరావు, ఏపి ప్రభుత్వ డ్రైవర్సు అసోషియేషన్ యన్టీఆర్ జిల్లా ప్రధానకార్యదర్శి డి.వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా రెవిన్యూ సర్వీసెస్ జిల్లా అధ్యక్షులు పి.ఏ.కిరణ్ కుమార్ తోపాటు ఏపి క్లాష్ 4 ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి 13 జిల్లాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *