Breaking News

విద్య, సంక్షేమం – బీసీ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

-వాడపల్లి ఎమ్ జె పి గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి, ఎమ్మెల్యే
-రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఎమ్‌.జె.పి. గురుకుల పాఠశాలలు ఏర్పాటు
–బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్‌. సవిత ఆదివారం కొవ్వూరు నియోజకవర్గంలో శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

పర్యటన నేపథ్యంలోచాగల్లు మరియు తాళ్లపూడి మండలాలకు చెందిన పది మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద రూ.4,50,500 విలువైన చెక్కులను మంత్రి చేతుల మీదుగా కొవ్వూరు లో అందజేశారు. అనంతరం మంత్రి సవిత వాడపల్లి గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహం మరియు మహాత్మా జ్యోతిరావు పూలే (ఎమ్‌.జె.పి.) గురుకుల పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ “ప్రజల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఎమ్‌.జె.పి. గురుకుల పాఠశాలలు స్థాపన జరుగుతోందని పేర్కొన్నారు.

వాడపల్లి మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజన నాణ్యతను పరిశీలించారు. “మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలవుతోందా? మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా?” అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం కావడంతో గురుకుల పాఠశాల వద్దకు వొచ్చిన విద్యార్థుల తల్లులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది . ప్రభుత్వం ఐ వి ఆర్ ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, మరింత మెరుగ్గా పౌర సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. స్త్రీ శక్తి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో ప్రయోజనం పొందుతున్నామంటూ మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.

విద్యార్థుల భద్రత కు ఆరోగ్య సంరక్షణ కు పెద్ద పీట వేసే క్రమంలో “ప్రతి వసతి గృహం, పాఠశాలలో సీసీ కెమెరాలు, మినరల్ వాటర్ ప్లాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత తెలియ చేశారు. విద్యార్థులకు ప్రతి వారం వైద్య పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తల్లిదండ్రులతో విద్యార్థులు మాట్లాడేందుకు కాయిన్ బాక్స్ ఫోన్ సౌకర్యం కల్పించాం” అని తెలిపారు. ఈ సమయంలో కొందరు విద్యార్థులతో ఫోన్ ద్వారా వారి తల్లిండ్రులతో మాట్లాడించడం జరిగింది. ప్రస్తుతం అద్దె భవనంలో ఉన్న ఈ గురుకుల పాఠశాలకు త్వరలో స్వంత భవనం నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల అంచనా లకు అనుగుణంగా సంక్షేమం మరియు అభివృద్ధి పథకాలను వేగంగా అమలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కష్టాల్లో ఉన్న కుటుంబాలకు సమయానుకూల సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఆర్డీవో రాణి సుస్మిత, బీసీ సంక్షేమ అధికారి బి. శశాంక, ప్రిన్సిపల్ వి ఆనంద్ రాజ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *