విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో యువత జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించే విధంగా క్రీడా సంఘాల కృషి చేయాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ క్రీడా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు, యువత రాణించే విధంగా క్రీడా సంఘాలు పనిచేయాలన్నారు. నగరంలోని క్రీడా ప్రాంగణములకు అవసరమైన సదుపాయలు కల్పించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. సమావేశంలో SAAP అసిస్టెంట్ డైరెక్టర్ (టెక్నికల్ ) ఎస్. వెంకట రమణ, డి.ఎస్.డి.ఓ బి.శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ డైరెక్టర్ అఫ్ స్పోర్ట్స్ ఇన్ ఛార్జ్ టి.ఉదయ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ స్పోర్ట్స్ డి.రమేష్ బాబు, కృష్ణ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రెటరి కె.పి రావు మరియు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …