విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతిపిత మహాత్మా గాంధీజీ, భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాన్ని శనివారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్ట్రీ విగ్రహాలకు సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశ సమగ్ర అభివృద్ధికి గాంధీజీ, లాల్ బహదూర్ శాస్ట్రీ కన్న కలలను సాకారం కావడానికి ఈ సందర్భంగా ప్రతిఒక్కరు ప్రతిన పూనాలన్నారు. వారు ఇరువురి ఆదర్శాలు అనుసరణీయమన్నారు. కార్యక్రమంలో ఏవో శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …