విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీఎస్పీఎఫ్ విజయవాడ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ విజయవంతంగా ముగిసింది. ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ పోటీలకు విజయవాడ జోన్ పరిధిలోని ఎస్పీఎఫ్ యూనిట్లు అయిన విజయవాడ గాడ్స్, ఏపీ సెక్రటేరియట్, ఏపీ హైకోర్టు, ఎయిర్పోర్ట్ మరియు డా. ఎన్.టి.టి.పి.ఎస్. యూనిట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ స్పోర్ట్స్ మీట్‌కు సంబంధించి అన్ని యూనిట్లకు చెందిన అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్స్పెక్టర్లు, ఎస్పీఎఫ్ ఇతర అధికారులు మరియు గవర్నమెంట్ ప్రెస్ డీజిఎం మోహన్ కుమార్ కూడా పాల్గొని, పోటీలను విజయవంతంగా నిర్వహించడంలో తమ సహకారాన్ని అందించారు. ఈ రెండు రోజుల స్పోర్ట్స్ మీట్ జనవరి 3 మరియు 4 తేదీల్లో, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్, ముత్యాలంపాడు నందు నిర్వహించబడింది.
ఈ కార్యక్రమాన్ని ఏపీఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రివిక్రమ వర్మ, ఐపిఎస్ వారి మార్గదర్శకత్వంలో, ఐజి బీవీ రామిరెడ్డి మరియు కమాండెంట్ ఎం. శంకర్రావు వారి పర్యవేక్షణలో, విజయవాడ గాడ్స్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ పి. సుందర్ రావు సమర్థవంతంగా నిర్వహించారు. పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఏపీ సెక్రటేరియట్ యూనిట్ విజేతలుగా నిలిచింది. ఈ సందర్భంగా విజేతలకు అధికారులు అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News