Breaking News

రానున్న వర్షాకాలం దృశ్య నగరంలోని డీసిల్టింగ్ పనులను పూర్తిస్థాయిలో చేస్తున్నాం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న వర్షాకాలం దృశ్య నగరంలోని డీసిల్టింగ్ పనులను పూర్తిస్థాయిలో చేస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా రమేష్ హాస్పటల్ రోడ్డు, గురునానక్ కాలనీ రోడ్, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, పంట కాలువ రోడ్డు, పటమట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని డీసిల్టింగ్ ప్రక్రియను పూర్తిస్థాయిలో చేయాలని, ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ పనులను అధికారులు పర్యవేక్షిస్తుండాలని, వర్షాకాలం లో రోడ్డుమీద నీటి నిల్వలు ఉండకుండా ఉండాలంటే డీసిల్టింగ్ ప్రక్రియ ఇప్పుడు పూర్తిస్థాయిలో చేస్తేనే అది సాధ్యమవుతుందని అన్నారు. తదుపరి ఆటోనగర్ లో గల గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను పరిశీలించి, వ్యర్ధాలను ఎప్పటికప్పుడు జిందాల్ కు తరలించేరా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి పటమట లో గల అన్న క్యాంటీను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడికి వచ్చిన ప్రజలకు ఆ అన్న క్యాంటీన్లో ఉన్న వసతులపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వసతులన్నీ చాలా బాగున్నాయి అని వారు తెలుపగా, సంతృప్తి చెందారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆహారంలో నాణ్యత, త్రాగునీటి సరఫరా, అన్న క్యాంటీన్లో గల సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తమకు నివేదికను సమర్పిస్తుండాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె. షమ్మీ, సుప్రింటెంటింగ్ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *