Breaking News

నగరాభివృద్దే ప్రథమ లక్ష్యం, ప్రజల క్షేమమే ప్రధాన ధ్యేయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరాభివృద్దే ప్రథమ లక్ష్యం, ప్రజల క్షేమమే ప్రధాన ధేయంగా ప్రజా ప్రతినిధులు, వియంసి అధికారుల మధ్య సమన్వయ సమావేశాని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, సెంట్రల్ మరియు పశ్చిమ నియోజకవర్గం ప్రతినిధులతో శాఖధిపతుల సమక్షంలో ఈ సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ నగరపాలక సంస్థ లో జరుగుతున్న పనులను, స్థితిగతులను తెలిపారు. అందులో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026లో భాగంగా మూడు చెత్తబుట్టలకు బదులుగా నాలుగు చెత్తబుట్టలను వాడుతున్నామని, వేసవికాలం దృశ్య పెట్టిన 106 చలివేంద్రాలు, సమ్మర్ యాక్షన్ ప్లాన్ అలాగే వర్షాకాలం దృశ్య నిర్వహిస్తున్న డిసిల్టింగ్ పనులు, అమృత్ 1.0 స్థితిగతులు, నగరపాలక సంస్థ ఆస్తులకు పై వర్తిస్తున్న కొత్త జీవో ఎంఎస్ 92, దాని ప్రకారంగా మూడు సంవత్సరాలకు వేసే 33% పెరుగుదలను ప్రతి సంవత్సరం 7% వేస్తున్నట్లు తద్వారా లీజుదారులకు అద్దె తగ్గుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మధ్య వ్యత్యాసం లేకుండా ఉన్నా రెంటును, ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కు 20% వ్యత్యాసం, సెకండ్ ఫ్లోర్ కి 30% వ్యత్యాసం ఈ జీవో ద్వారా ఉండబోతుందని తెలిపారు.

ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆదాయం పెరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని అందులో భాగంగా నగరంలోని కల్యాణ మండపాలకు మరమ్మతులు నిర్వహించి వాటికి తగ్గట్టుగా ప్రజలకు అందుబాటుగా ఉండేటట్టుగా రేటును నిర్ణయించాలని తెలిపారు. నగరంలోని ప్రధాన ఉద్యానవనాలకు ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయాలని, రోడ్లు వేసే ముందే డ్రైన్ పనులన్నీ పూర్తి చేసుకొని రోడ్లు, డ్రైన్లు, పేవర్ బ్లాక్ అన్ని ఒక్కసారిగా వేసేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైల్వే స్టేషన్ కి వెళ్లే దారిలో ఉన్న బి ఆర్ టి ఎస్ రోడ్డు చివరి భాగంలో ఫుడ్ కోర్ట్ ని ఏర్పాటు చేయాలని అలాగే పాలిటెక్నిక్ కాలేజ్ సర్వీస్ రోడ్డు వద్ద గల గ్రీన్ స్పేస్ లో దారి, లైటింగ్ ఏర్పాటు చేసి ఫుడ్ కోర్ట్ ను ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాం వాటర్ డ్రైన్ స్థితిగతులను తెలుసుకున్నారు రానున్న వర్షాకాలం దృశ్య రోడ్డు మీద నీటి నిలువలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా తీర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కొండ ప్రాంత వాసులకు రక్షణగా ప్రమాదకరమైన ప్రదేశాలలో కంచెను ఏర్పాటు చేయాలని, వర్షాకాలంలో కొండపై నుంచి వచ్చే నీరుకు ఒక ప్రత్యేక కాలువను ఏర్పాటు చేసి తద్వారా మేజర్ కాలువలోకి కలపాలని కోరగా, స్ట్రాం వాటర్ డ్రైన్ ప్రాజెక్ట్ డి పి ఆర్ లో భాగంగా అది కూడా ఉందని అధికారులు తెలిపారు. నగరపాలక సంస్థ కళ్యాణ మండపాలలో కేవలం విఎంసి సిబ్బందికి మాత్రమే కాకుండా అక్కడ ఉండే స్థానికులకు కమిటీ సభ్యులుగా ఉంచి కళ్యాణ మండపాల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే నగరపాలక సంస్థకు ఆదాయం పెరుగుతుందని సూచించారు. రివర్ ఫ్రెంట్ పార్కును పూర్తి చేయాలని, కృష్ణలంక వైపు నుంచి పార్కుకి వెళ్లే దారి ప్రతి సందు నుంచి మెట్ల మార్గం ద్వారా కల్పించాలని అన్నారు.

తదుపరి పశ్చిమ నియోజకవర్గం మరియు సెంట్రల్ నియోజకవర్గం ప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యేల తరఫున వారి ప్రతిపాదనలను తెలిపారు అందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలకు ఖాళీ స్థలాలలో పార్కులను ఏర్పాటు చేయాలని, ఎర్రకట్ట ఆర్ఓబి, పంచా సెంటర్ ఎఫ్ఓబి, తదితర అంశాలు తెలుపుగా వాటి స్థితిగతులను అధికారులు తెలుపారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గం నుండి ఐకానిక్ పార్క్ ను పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని, ఉన్న పార్కులను మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులో చేసేటట్టు చర్యలు తీసుకోవాలని, బావాజి పేట కెనాల్ బండ్ వద్ద వాకింగ్ ట్రాక్, వైవిఆర్ ఎస్టేట్ యు జి డి వంటి అంశాలను అధికారులకు తెలుపగా, అధికారులు ఐకానిక్ పార్క్ లో కోటి రూపాయల అభివృద్ధి పనులు సాంక్షన్ అయ్యి జరుగుతున్నాయని, మిగతా వాటి స్థితిగతులను తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి. చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ కె. ప్రభుదాస్, కె. షమ్మీ, చీఫ్ సిటీ ప్లాన్నార్ కె. సంజయ్ రత్న కుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె . అర్జునరావు, చీఫ్ ఇంజినీర్ ఇంచార్జి పి. సత్యకుమారి, అకౌంట్స్ ఆఫీసర్ బి.సత్యనారాయణమూర్తి, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీనివాస్, సామ్రాజ్యం, సురేఖ, గోపాలకృష్ణ,ప్రభాకర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ గోపాల నాయక్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డి హరీష్, బయాలజిస్ట్ కామేశ్వరరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *