Breaking News

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్లానింగ్ విభాగానికి ప్రత్యేక శిక్షణ APDPMS ట్రైనింగ్ 2.0 కార్యక్రమం నిర్వహణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు పట్టణ ప్రణాళిక సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మరియు సులభతరంగా అందించాలనే లక్ష్యంతో పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్లానింగ్ విభాగ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ APDPMS ట్రైనింగ్ 2.0 కార్యక్రమాన్ని గురువారం విజయవాడలో నిర్వహించారు.

రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, రాజమండ్రి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం, వన్‌టౌన్‌లో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాఫ్ట్ టెక్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ సంధ్య శిక్షణనిచ్చారు .

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన భవన నిర్మాణ ప్లాన్ల పరిశీలన, అభివృద్ధి అనుమతుల జారీ ప్రక్రియ, ఆన్‌లైన్ సేవల సమర్థ వినియోగం, ప్రజలకు వేగవంతమైన మరియు పారదర్శక సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై నిపుణులు సవివరంగా అవగాహన కల్పించారు.

అలాగే నగరాభివృద్ధి, ఆధునిక పట్టణ ప్రణాళిక విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం, సేవల సరళీకరణ తదితర అంశాలపై కూడా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌డీడీ రాజమండ్రి జి. సుబ్బారావు, ఏపీ సీఆర్‌డీఏ జాయింట్ డైరెక్టర్లు, ఎల్‌టీపీ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, NAREDCO, CREDAI, BAI ప్రతినిధులు, సాఫ్టెక్స్ సంస్థకు చెందిన సంధ్య మరియు ఆమె బృందం, విజయవాడ నగరపాలక సంస్థ ప్లానింగ్ విభాగ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *