Breaking News

మరో రెండు రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయని దీని ప్రభావంతో మరో రెండు రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

శుక్రవారం (08-05-26) అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

శనివారం (09-05-26) అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.

మరోవైపు అల్లూరి జిల్లా జికే వీధి మండలంలో(1) తీవ్రవడగాలులు, అలాగే అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు, పెదబయలు మండలాలు, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో(07) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

గురువారం పోలవరం(జి) విఆర్ పురంలో 41.7°C, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 41.3°C, కర్నూలు(జి) నగరడోన, కడపలో 41.2°C, నంద్యాల(జి) ఆళ్లగడ్డలో 41.1°C, పశ్చిమగోదావరి(జి) పోడూరులో 41°C, అనంతపురం(జి) తెరన్నపల్లి, ఏలూరు(జి) ధర్మాజీగూడెం, పల్నాడు (జి) బెల్లంకొండలో 40.8°C, ఎన్టీఆర్(జి) చిలకల్లులో 40.3°C, తిరుపతి(జి) ఏర్పేడులో 40.1°C, ప్రకాశం(జి) కొప్పెరపాడులో 40 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.

సాయంత్రం 5 గంటల నాటికి అల్లూరి జిల్లా గంపరైలో 21.5మిమీ, గుంటూరు జిల్లా మంగళగిరిలో 15.2మిమీ, తూర్పుగోదావరి జిల్లా కోరుమామిడిలో 13.2మిమీ, గుంటూరు పశ్చిమ నల్లపాడులో 12మిమీ వర్షపాతం రికార్డైందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *