విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, విజయవాడ డివిజనల్ సెక్రటరీ లీల, హింద్ మజ్దూర్ సభ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఎన్. శ్రీనివాస రావు ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ ని కలిసి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి గెజెట్ విడుదల చేసి 01.06 26 నుండి నూతన జోన్ ఏర్పాటు చేసినందుకు రైల్వే కార్మికుల తరపున ధన్యవాదములు తెలియచేసారు. ఈ సందర్భముగా నూతన సౌత్ కోస్ట్ జోన్ లో విజయవాడ నందు సెంట్రల్ రైల్వే హాస్పిటల్ ఏర్పాటు, జోనల్ ట్రైనింగ్ సెంటర్లు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు మరియు రైల్వే ఉద్యోగులకు మంగళగిరి AIIMS నందు చికిత్స సదుపాయం కొరకు పార్లమెంట్ సభ్యులు శివనాధ్ కి మెమొరాండం ఇచ్చి వాటి ఆవశ్యకత గురించి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే ఉద్యోగాలు లభించాలంటే తప్పనిసరిగా విజయవాడ లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధముగా రైల్వే ఉద్యోగులకు మెరుగైన చికిత్స సదుపాయాల కొరకు రైల్వే రిఫరల్ సదుపాయం కల్పించాలని, గుంతకల్, గుంటూరు, విశాఖపట్నం మరియు విజయవాడ డివిజన్లలోని రైల్వే కార్మికులకు మరియు పెన్షనర్ ల కొరకు సెంట్రల్ రైల్వే హాస్పిటల్ నిర్మించాలని, అన్ని విభాగాల ట్రైనింగ్ సెంటర్ లను విజయవాడ లో ఏర్పాటుచేయాలని లీల ఈ సందర్భంగా కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశయాల సాధనకు, రాజధాని అమరావతి అభివృద్ధి లో భాగముగా నూతన జోన్ లో రైల్వే పరంగా అన్ని రకాల అభివృద్ధి చర్యలు చేపట్టాలని లీల కోరటం జరిగింది.
Prajavartha Online Telugu News