Breaking News

అర్జీల పరిష్కారంలో బ్రాండ్ తెచ్చుకోవాలి

-ఇకపై ప్రజా ప్రతినిధులు… అధికారులు ఉమ్మడిగా పీజీఆర్ఎస్
-ప్రతీ శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డే
-సత్వర ఫైళ్ల క్లియరెన్సుతో సత్వర సేవలు
-ప్రజల సమయాన్ని వృధా చేయొద్దు
-టెక్నాలజీని వినియోగించండి… మానవీయ కోణంతో వ్యవహరించండి
-7వ రోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
అర్జీలు, ఫిర్యాదులు పరిష్కారంలో ఎలాంటి అలక్ష్యం చూపొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొందరు కలెక్టర్లు అర్జీలు తీసుకుని కారులోనే పడేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని.. అలా జరగ్గకూడదని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజున వివిధ అంశాలపై సమీక్షించారు. ఫైళ్ల క్లియరెన్స్.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, డేటా లేక్, అవేర్, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఇ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడం మంచి పరిణామం. ఇ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగంగా ఉన్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలకు సీఎం అభినందనలు. పెద్దమొత్తంలో ఫైళ్లు వచ్చినా సరాసరి 10 గంటల వ్యవధిలో ఫైళ్లను డిస్పోజ్ చేసిన సీఎస్ సాయి ప్రసాద్‌ను అభినందిస్తున్నా. ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనుకబడిన పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు వేగం పెంచాలి. గత మూడు నెలలతో పోల్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫైళ్ల క్లియరెన్స్ సమయం 10 రోజుల నుంచి రెండు రోజులకు తగ్గింది. ఫైళ్లను త్వరగా క్లియర్ చేస్తే ప్రభుత్వ సేవలు మరింత త్వరగా అందుతాయి. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో ఫైళ్ల క్లియరెన్స్ అతి ముఖ్యమైన అంశం. సీఎస్, సెక్రటరీలు, హెచ్వోడీలు మొదలుకుని.. మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్సులో వేగం పెరగాలి. మ్యానువల్ ఫైళ్లనేవి దాదాపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పాలనకు టెక్నాలజీ అనుసంధానించడంతోపాటు… హ్యుమన్ టచ్ కూడా ముఖ్యం. మానవీయ కోణంలో ఆలోచించి పరిపాలన చేపట్టాల్సిన అవసరం ఉంది. 24 గంటల్లోపు ఇ-ఫైల్స్ డిస్పోజ్ చేసేలా మంత్రులు, అధికారులు శ్రద్ధ పెట్టాలి. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరి పని తీరును ఎప్పటికప్పుడు నమోదు చేస్తూనే ఉన్నాం. జిల్లాల్లో ఇ-ఆఫీస్ ద్వారా లేని ఫైల్స్ ఎన్ని ఉన్నాయో గుర్తించండి. జిల్లా స్థాయిలో, హెచ్ఓడీలు తప్పనిసరిగా ఇ-ఫైల్స్ మాత్రమే జనరేట్ చేయాలి. ప్రజలకు సేవలందించే విషయంలో వినూత్న ఆలోచనలతో పాటు… మరింత మెరుగైన పాలనకూ కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలి.”అని సూచించిన సీఎం చంద్రబాబు.

పీజీఆర్ఎస్ కోసం ప్రజా దర్బార్లు

“పీజీఆర్ఎస్ కోసం ప్రజాదర్భార్ లాంటి ఓ వేదికను ఏర్పాటు చేయబోతున్నాం. ఫిర్యాదులు స్వీకరించే సమయంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. సింగపూర్ లో ఇదే రకంగా ఫిర్యాదుల పరిష్కారం జరుగుతోంది. మండల స్థాయిలోనూ పీజీఆర్ఎస్ విధానంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించటం ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవియన్స్ స్వీకరిస్తున్నట్టే… ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో గ్రీవియన్స్ స్వీకరించాలి. ప్రతీ శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డేగా నిర్ణయిచాం. సమస్యలు పరిష్కారమైతే బ్రాండ్ రావటంతో పాటు ప్రజల్లో విశ్వాసం పెరగటం ముఖ్యం. కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు… పిటిషన్లకు పరిష్కారం చూపాలి. ప్రతీ నెలా ఒక నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించాలి. సమస్యల పరిష్కారానికి గుడ్ విల్ మిషన్ గా కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లాలి. అన్ని వీడియో కాన్ఫరెన్సులను కూడా ఒకరోజుకు పరిమితం చేద్దాం.”అని ముఖ్యమంత్రి అన్నారు.

ఆన్ లైన్ సేవలతో అవినీతికి చెక్

“ప్రభుత్వ నిబంధనలు, ప్రొసీజర్స్ సులభతరం కావాలి. కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత టైమ్ వృధా అవుతుందో ఆలోచించండి. ప్రజలకు త్వరితగతిన సేవలు అందిస్తూ.. ఆన్ లైన్ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెస్తే ప్రజల సమయం వృధా కాదు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే… పాలన సులభతరం అవుతుంది. వాట్సప్ గవర్నెన్సు మనమిత్ర ద్వారా పౌరసేవలపై ప్రజలకు శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే 29 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాం… 90 శాతం ప్రభుత్వ సేవలు వాట్సప్ లో అందుబాటులో ఉన్నాయి. డిసెంబరు నాటికి అన్ని సేవల్ని వాట్సప్ లో అందించేలా చూడాలి. మాన్యువల్ టచ్ పాయింట్ల వద్దకు వచ్చే ప్రజలకు వాట్సప్ వినియోగాన్ని వివరించాలి. స్మార్ట్ ఫోన్లు లేని కుటుంబాలు 34 శాతంగా ఉన్నాయి. ఆన్ లైన్ సేవల ద్వారా అవినీతితో పాటు దుర్వినియోగం కూడా తగ్గుతుంది. అవేర్ 2.0 నుంచి వచ్చే సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలి. పిడుగుల హెచ్చరికలను జారీ చేయటంలో ఇంకా పర్ఫెక్షన్ రావాలి. తుపాన్ల హెచ్చరికల సమయంలో నేరుగా మొబైళ్లకే మెసేజిలు పంపించాలి. తుపాన్ల హెచ్చరికలను స్వర్ణ గ్రామ,వార్డుల ద్వారా కూడా పంపించాలి. సీవీడ్ సాగుపై తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు దృష్టి పెట్టాలి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టాలి. మున్సిపాలిటీలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఎలాంటి అక్రమ నిర్మా్ణాలూ లేకుండా చూడాలి.”అని సీఎం ఆదేశించారు. ఇక అవేర్, డేటా లేక్ అంశాలపై జరిగిన సమీక్షలో భాగంగా సీఎం కొన్ని కీలక సూచనలు చేశారు. పరిపాలనలో భాగంగా వేర్వేరు వెబ్ సైట్లు, డ్యాష్ బోర్డులు కాకుండా ఒకే ప్లాట్ ఫాంపై ఉండేలా చూడాలని ఐటీ శాఖకు సీఎం సూచించారు. అన్ని శాఖలకు సంబంధించిన కేపీఐలతో ఓ డ్యాష్ బోర్డు తయారు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ తెలిపారు. రోజువారీ లక్ష్యాలను ఈ డ్యాష్ బోర్డు నుంచి గుర్తించి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుందని మంత్రి లోకేష్ చెప్పారు. 90 రోజుల్లో ఈ డ్యాష్ బోర్డును అందుబాటులోకి తెస్తామని ఐటీ మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు

-ప్రైవేట్ ఏజెన్సీకి టెండర్ ద్వారా నిర్వహణ భాద్యతలు -ఇప్పటికే కూటమి పాలనలో 12 కేంద్రాలు ఏర్పాటు -వైద్య ఆరోగ్య శాఖ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *