పేదల ఆరోగ్యానికి కొండంత అండ ‘సీఎంఆర్ఎఫ్’: మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలు పట్టణం లోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో రూ.71.81 లక్షల విలువైన 125 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎల్‌ఓసీలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్
-నియోజకవర్గంలో ఇప్పటివరకు 998 మంది లబ్ధిదారులకు రూ.6.79 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడి

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేద ప్రజల ఆరోగ్య భద్రతకు ఒక గొప్ప వరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం నిడదవోలు పట్టణంలోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో నియోజకవర్గానికి చెందిన 125 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 71,81,116 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను, ఎల్‌వోసీ పత్రాలను మంత్రి దుర్గేష్ స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. 113 మందికి రూ. 45,38,253 విలువైన చెక్కులు, 12 మందికి రూ. 26,42,863 విలువైన ఎల్వోసీ పత్రాలు అందించామన్నారు. “నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ, మరియు ప్రత్యేక ఆర్థిక సాయం ద్వారా మొత్తం 998 మంది బాధితులకు రూ. 6,79,62,676 ఆర్థిక లబ్ధి చేకూర్చాం.”అని మంత్రి కందుల దుర్గేష్ వివరాలు వెల్లడించారు. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, పేద ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిరుపేదలకు ప్రతి 15 రోజుకొకసారి సీఎంఆర్ఎఫ్ సాయం అందిస్తుండం గొప్ప విషయమని, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు.

సకాలంలో నిధులు విడుదల చేసి పేదలను ఆదుకుంటున్నందుకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల కు మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో నిరుపేదలకు సైతం అత్యాధునిక కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందే పేదలపై ఆర్థిక భారం పడకుండా సీఎంఆర్ఎఫ్ ద్వారా పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. బాధితులు శారీరకంగా, ఆర్థికంగా కుంగిపోకుండా కొండంత అండగా నిలవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.

ప్రభుత్వానికి లబ్ధిదారుల కృతజ్ఞతలు

కష్టకాలంలో తమకు అండగా నిలిచినందుకు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబాలను ఆదుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు స్థానిక శాసనసభ్యులు, మంత్రి కందుల దుర్గేష్ లకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *