దివ్యాంగుల పట్ల దయ, సానుభూతిని చూపించటంతో పాటు వారిని ప్రోత్సహించాలి – ఉపరాష్ట్రపతి

-వారిలో ఉండే ప్రతిభను గుర్తించి సరైన అవకాశాలు కల్పించగలిగితే ఏ రంగంలోనైనా వారు రాణించగలరు
-దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు ప్రైవేట్ రంగం ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి సూచన
-బ్యాంకులు సైతం వారికి సానుకూల దృక్పథంతో విరివిగా రుణాలు అందించాలి
-నెల్లూరులోని దివ్యాంగుల ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి

నెల్లూరు,  నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాంగుల పట్ల సమాజం దయతో, సానుభూతితో వ్యవహరించడంతో పాటు వారిని సాధికారత దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వారిలో ఉన్న ప్రత్యేకమైన ప్రతిభను గుర్తించడం ద్వారా వారి సహకారంతో ఉన్నతమైన సమాజ నిర్మాణం సాధ్యమౌతుందని  ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. నెల్లూరులోని దివ్యాంగుల నైపుణ్యం, సాధికారత, పునరావాస సమ్మిళిత ప్రాంతీయ కేంద్రాన్ని (కాంపోజిట్ రీజనల్ సెంటర్) ఉపరాష్ట్రపతి సందర్శించారు. అనంతరం అక్కడి దివ్యాంగులతోనూ, సిబ్బందితోనూ ఉపరాష్ట్రపతి ముచ్చటించారు.
ఇటివల టోక్యో పారాలింపిక్స్ లో భారతదేశ క్రీడాకారుల ప్రతిభను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, దివ్యాంగులైన క్రీడాకారులు చూపించిన ప్రతిభ భారతీయులందరికీ ప్రేరణగా నిలించిందని తెలిపారు. ఎలాంటి వైకల్యాన్నైనా ఆత్మవిశ్వాసంతో అధిగమించవచ్చనే విషయం ఇది రుజువు చేసిందన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన మౌలిక సదుపాయాల సృష్టి కోసం పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, వారి నైపుణ్యాన్ని సరిగా వినియోగించుకోగలిగితే అద్భుతాలు సాధించవచ్చని, ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగం వీరి నైపుణ్యాన్ని వినియోగించుకుని, వారికి సాధికారత కల్పించే దిశగా ముందుకు రావాలని సూచించారు. బ్యాంకులు సైతం సానుకూల దృక్పథంతో వారికి రుణాలు అందించేందుకు ముందుకు రావాలని సూచించారు. సికింద్రాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్ మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటిలెక్టువల్ డిజెబిలిటీస్ (ఎన్.ఐ.ఈ.పి.ఐ.డి) ఆధ్వర్యంలో నెల్లూరులోని సి.ఆర్.సి. పని చేస్తోంది. ప్రస్తుతం దివ్యాంగుల కోసం డాటా ఎంట్రీ ఆపరేషన్, కుట్టు మిషన్ ఆరేషన్, ఆపీస్ అసిస్టెంట్ ట్రైనింగ్, ఎల్.ఈ.డీ. బోర్డు తయారీ లాంటి వృత్తినైపుణ్య శిక్షణను ఈ సంస్థ అందిస్తోంది. ఈ సందర్భంగా సామాజిక న్యాయం మరియు సాధికారత కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్స్ అండ్ కార్పొరేషన్స్ పంపిణీ చేసిన ఉపకరణాలను ఉపరాష్ట్రపతి దివ్యాంగులకు అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ను ఉపరాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా వెనుకబడిన వర్గాలకు చెందిన దివ్యాంగులకు అందించిన సహాయం గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగాల్లో అదనపు రిజర్వేషన్లు సహా దివ్యాంగులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. నెల్లూరు సి.ఆర్.సి. సిబ్బంది, శిక్షణార్ధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *