“ పోలవరం రాష్ట్రానికి జీవనాడి – స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సకారానికి వరప్రదాయిని “ : లంకా దినకర్

ఏలూరు/ పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రాజెక్టు పనులను బుధవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి, ఏపి 20 సూత్రాలు పథకం చైర్ పర్సన్ లంకా దినకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీరితోపాటు రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు ఇంజనీరింగు బృందం పూల మొక్కలు,పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం స్కిల్ వే, కాపర్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, టర్నల్స్, తదితర పనులను పరిశీలించి, పనులు పురోగతిపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను, మ్యాపులను పరిశీలించారు. ఇంజనీరింగు అధికారులను వివరాలను అడిగి తెలుసుకుని ఏపీ 20 సూత్రాల పథకం చైర్ పర్సన్ లంకా దినకర్ సంతృప్తిని వ్యక్తం చేశారు.

అనంతరం లంకా దినకర్ పోలవరం ప్రాజెక్ట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది

పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి – స్వర్ణాంధ్రప్రదేశ్ ను వికసిత్ భారత్ లో భాగస్వామ్యం చేయడానికి కీలకం అని ఆయన పేర్కొన్నారు

ప్రధాని నరేంద్ర మోడీ పోలవరం పూర్తి కోసం నిధులు ఇస్తున్నారు, ఈ ఆర్ధిక సంవత్సరంలో 6 వేల కోట్లు కేటాయించారు, జూన్ 2026 నాటికి మొదటి దశ పూర్తి చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు అని తెలిపారు. జూన్ 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు త్రాగు మరియు సాగు నీరు మరియు పారిశ్రామిక అవసరాలకు నీరు పుష్కలంగా అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పని చేస్తున్నారు, దీనికి అవసరమైన సహాయ సహకారాలను ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్నట్లు లంకా దినకర్ తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు కి అనుసంధానంగా పర్యాటక రంగం అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు కల్పన అవసరమని రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ పేర్కొన్నారు.

వీరి వెంట ఐటిడిఏ పీవో కె.రాములు నాయక్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిఇ రమేష్ కుమార్, యస్ఇ కె.రామచంద్రరావు, ఇఇలు డి.శ్రీనివాసు, పి.వి. వెంకటరమణ, డిఇ మాధవరావు, ఇంజనీరింగు బృందం, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *