-ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీల పెంపు వర్తింపు
-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పేద విద్యార్థుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ…సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందిస్తున్నాం. సంక్షేమ శాఖలపై నిన్నటి సమీక్షలో డైట్ చార్జీలు 10 శాతం పెంచుతూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీల పెంపు వర్తింపు చేయాలని సీఎం ఆదేశించారు. హాస్టళ్ల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూళ్లల్లో నెట్‌జీరో విధానం అమలు చేస్తాం. బయో డైవర్శిటీ పార్కుల తరహాలో గురుకులాలను నిర్వహించనున్నాం. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల మెయింటెనెన్స్ గ్రాంట్ నిమిత్తం రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం తెలిపారు. ఐఐటి నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు 3 నుంచి 12 కి పెంచాం. ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనబరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ప్రారంభిస్తాం. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను మ్యాపింగ్ చేసి నైపుణ్యం పెంచి పారిశ్రామిక అవసరాలకు వర్క్‌ఫోర్స్ సిద్దం చేస్తాం. హాస్టళ్లు, గురుకులాలు, విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఓ వైద్య విభాగం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి సూచన మేరకు సంక్షేమ హాస్టళ్లను ఎన్ఆర్ఐలు అడాప్ట్ చేసుకునేలా వారితో సంప్రదింపులు జరుపుతాం. దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు ఇంద్రధనస్సు తీసుకొచ్చారు. పీ4 ద్వారా రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
Prajavartha Online Telugu News