-విజయవాడను బాలల స్నేహ నగరంగా తీర్చిదిద్దుదాo!
-ఆపదలో ఉన్న బాలలకై పిలిస్తే పలికే నేస్తం-చైల్డ్ లైన్-1098
-విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాలల హక్కుల పరిరక్షణకై కలసినడుద్దం అని, అందరి సహాయ సహకారములతో విజయవాడను బాలల స్నేహ నగరంగా తీర్చిదిద్దుదాo అని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు.
“ బాలల హక్కుల పరిరక్షణ – వార్డ్ సచివాలయ సిబ్బంది, స్వయం సహాయ సంఘాల పాత్ర” అనే అంశము పై విజయవాడ నగరపాలక సంస్థ, చైల్డ్ లైన్-1098, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ సంయుక్తంగా హనుమాన్ పేట లోని శ్రీ టివి భవన్ లో నిర్వహిస్తున్న బాలల హక్కుల పరిరక్షణ – చైల్డ్ లైన్ సే దోస్తి వారోత్సవాలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు అధనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బాలల బాల్యాన్ని రక్షించడం అందరి భాద్యత అని బాలికల విద్య – అభివృద్ది అవకాశాలకు అందరూ సహకరించాలని అన్నారు. మహిళల – బాలికల రక్షణ కోసం ముఖ్యమంత్రి దిశ యాప్ ను అందించడం జరిగినది ఈ సందర్బంగా ఆమె గుర్తి చేసారు. మహిళా సంరక్షణ కార్యదర్శలు అందరు విధిగా వారి దగ్గర ఉన్న ప్రాంతాలను సందర్శించి బాలల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గత 25 సంవత్సరాలుగా బాలల హక్కు కొరకు ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, చైల్డ్ లైన్ – 1098 అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.
అదే విధంగా నగరపాలక సంస్థ అధనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ మాట్లాడుతూ బాలలందరూ విధిగా బడిలో ఉండేటట్లు చూడాలని సూచించారు. అలాగే ప్రతి చోట బాలల హక్కుల పట్ల పరిరక్షణ పట్ల మంచి స్పర్శ – చెడు స్పర్శ పై పిల్లలకు తెలియజేయాలని అన్నారు. పిల్లలపై హింస ఎక్కువగా కుటుంబం నుండే ప్రారంభ అవుతుందని, బాల వివాహలపై ప్రత్యేకoగా శ్రద్ద చూపాలని, ఎక్కువ అవగాహనా చైతన్యం నింపాలని సూచించారు.
చైల్డ్ లైన్ ఫారం డైరెక్టర్ నోయల్ హార్పర్ మాట్లాడుతూ బాల్యం బాలలందరికీ అందేలా చూడటం మనందరి భాద్యత అని, బాలలు సంతోషంగా ఆనందంగా ఎదిగే సమాజాన్ని నిర్మిద్దాం అని పిలుపునిచ్చారు. తదుపరి అతిధులు చైల్డ్ లైన్ సే దోస్తి పోస్టర్ ను ఆవిష్కరించి, అందరితో కలసి బాలల హక్కుల ప్రతిజ్ఞా చేసారు. తదుపరి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం పై కార్మిక శాఖా అసిస్టెంట్ కమిషనర్ అఫ్ లేబర్ ఎస్.గోవింద్ అవగాహన కల్పించారు. బాలల హక్కు – పరిరక్షణ పాత్ర అనే అంశము పై చైల్డ్ లైన్ 1098 జిల్లా కో-ఆర్డినేటర్ అరవ రమేష్ శిక్షణ నిర్వహించారు.
కార్యక్రమములో 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్, నగరపాలక సంస్థ సి.డి.ఓ జగదీశ్వరి, చైల్డ్ వెల్ఫేర్ కమిటి సభ్యులు ఎల్. ఫ్రాన్సిస్, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్లు నాగరాజు, శ్రీకాంత్, స్వయం సహాయక సంఘా సభ్యులు, సచివాలయం మహిళా సంరక్షణ కార్యదర్శలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.