జిటిఎస్ నిర్మాణ పనులని వేగవంతం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేషన్ల (జిటిఎస్) నిర్మాణ పనులని వేగవంతం చేయాలని, నిర్మాణ పనుల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమణాలు పాటించేలా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏటుకూరు రోడ్ లో నిర్మాణంలో ఉన్న జిటిఎస్ పనులను, అనంతరం జాతీయ రహదారి వెంబడి పారిశుధ్య పనులను ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పారిశుధ్య విభాగంలో జిటిఎస్ ల నిర్మాణం కీలకమని, అందుకు తగిన ప్రాధాన్యతగా నిర్మాణ పనులపై దృష్టి సారించాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. నిర్మాణ టెండర్ పొందిన కాంట్రాక్టర్లు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం జాతీయ రహదారి వెంబడి సర్వీస్ రోడ్ ని పరిశీలించి, రోడ్ల వెంబడి వ్యర్ధాలు వేయకుండా పర్యవేక్షణ చేయాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. వ్యర్ధాలు వేసే వారిపై భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలన్నారు.
పర్యటనలో సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, ఈఈ విష్ణు, డిఈఈ సతీష్ కుమార్, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *