హింద్రీనివా సుజల స్రవంతి (HNSS) మెయిన్ కెనాల్ పనులు వేగవంతం చేయాలి

-ఖాళీ చెరువులు నింపేలా కార్యాచరణ చేపట్టాలి…మంత్రి మండిపల్లి
-ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ తో మంత్రి మండిపల్లి భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అమరావతి సచివాలయంలో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్‌ను కలిసి HNSS మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ మెయిన్ కెనాల్ ద్వారా కేవీ పల్లి, గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లి, రాయచోటి, పీలేరు, చిత్తూరు ప్రాంతాలకు తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అలాగే HNSS కెనాల్ ద్వారా శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లను అనుసంధానం చేసి, మార్గమధ్యంలోని ఖాళీ చెరువులను నింపే విధంగా కార్యాచరణ కొనసాగించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీకి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడంలో ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *