“సుజన ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరాలతో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎం ఎల్ ఏ సుజన చౌదరి ఆధ్వర్యంలోని “సుజన ఫౌండేషన్” ద్వారా రెండో రోజు, ఆదివారం పూర్ణానందం పేట, కౌతా సుబ్బారావు మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ,నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎం ఎల్ ఏ సుజన చౌదరి, పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి శని, ఆదివారలలో ఉచిత మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ వైద్య శిబిరంలో కార్డియాలజీ ,జనరల్, డెంటల్, కంటి పరీక్షలు, బీ పీ, షుగర్, ఈ సీ జీ,
2డి ఎకో, ఎక్స్ రే, మరియు రక్త పరీక్షలు, ఉచితంగా చేస్తున్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేద ,మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పం తో ఎం ఎల్ ఏ సుజన ఈ శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ శిబిరంలో 86 మందికి నిపుణులైన వైద్యుల బృందం ప్రత్యేక శ్రద్ధతో చికిత్సలు అందించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

శంకర నేత్ర చికిత్సలయ, పీ వీ ఆర్ హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ వైద్యులు మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, 35 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ రాజ్, మేరీ సరోజినీ, రుద్రపాటి వెంకటేష్, మాజీ కార్పొరేటర్ పైడి మాల సుభాషిణి , సుజన ఫౌండేషన్ సిబ్బంది, సుజన మిత్రా కోఆర్డినేటర్లు ఈ శిబిరంలో తమ సేవలందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *