అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సీతానగరం ఆశ్రమం నందు ఆదివారం పూర్వ వేద విద్యార్థుల సమావేశం (కలయిక) ఎంతో వైభవంగా జరిగినది. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి కి పూర్వ విద్యార్థులందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్దలతో తమ శ్రద్ధ శక్తులను కనబరిచారు. అనంతరం ఆయన చేతులమీదుగా అందరికి శ్రీపాద తీర్ధాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో క్రేన్ వక్క పలుకులు అధినేత గ్రంధి కాంతారావు పాల్గొని స్వామి వారితో వారికున్న అనుబంధాన్ని తెలుపుతూ, సీతానగరం ఆశ్రమంతో తనతండ్రి గ్రంధి సుబ్బారావు ఎంతో అనుబంధం ఉన్నదని ఈ సందర్భంగా పాత స్మృతులను గుర్తు చేసు కున్నారు. ప్రతి సంవత్సరం వేద విద్యార్థుల సంఖ్య పెరగాలని, వేదం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి, ఈ తరం బాలలే పునాదులని, దానికి మనమందరం ఎంతో కృషి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Prajavartha Online Telugu News