13 న సంస్కృత మేధావుల సదస్సు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సంస్కృత మేధావులతో సదస్సు సోమవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమి అధ్యక్షులు ఆర్. డి. విల్సన్ @శరత్ చంద్ర తెలిపారు. తెలుగు మరియు సంస్కృత అకాడమీ అధ్యక్షులు ఆర్. డి. విల్సన్ @శరత్ చంద్ర నేతృత్వంలో సంస్కృత పండితులు, మేధావులతో సదస్సు విజయవాడ వడ్డేశ్వరంలో జరుగుతుందన్నారు. ఈ సదస్సు ద్వారా సంస్కృత భాష విస్తరణకి తీసుకోవలసిన కార్యాచరణ పై మేధావులతో చర్చించడం జరుగుతుందని విల్సన్ తెలియచేశారు. సంస్కృత భాష సౌరభం విస్తరణలో భాగంగా వివిధ పట్టణాల్లో నిర్వహించే సంస్కృత సప్తాహంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలియచేస్తూ “అందరికీ సంస్కృతం.. అందరిలోకీ సంస్కృతం” అనే నినాదంతో సంస్కృత భాష విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలియచేశారు. ఇప్పటికే సంస్కృత వ్యాప్తి కోసం అకాడమీ పటిత సంస్కృతం పేరుతో పుస్తకాలు ముద్రించి ఉందని, ఆ పరంపర కొనసాగుతుందని విల్సన్ @ శరత్ చంద్ర తెలియచేస్తూ సంస్కృత భాష సామాన్యుల లోకి తీసుకొని వెళ్లడం లక్ష్యం గా అకాడమీ ప్రస్థానం సాగుతుంది అని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *