విశాఖపట్నంలో రేపు ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ రాష్ట్రస్థాయి సమావేశం

-ఉద్యమ కార్యాచరణపై కీలక నిర్ణయాలు
– సమావేశం అనంతరం 4 గంఃలకు మీడియా సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ​
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఆర్టీసీ పరిరక్షణ, ప్రభుత్వానికి సమగ్రంగా ఉద్యోగుల డిమాండ్లను తెలియజేసే తదుపరి ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్రస్థాయి నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించబడుతుంది.
ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న ఉద్యమ కార్యాచరణ, ఈనెల 14 నుండి ప్రజాప్రతినిధులను కలిసే కార్యక్రమాలుపైన,ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన తదుపరి చర్యలపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
సమావేశం అనంతరం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ల ఆధ్వర్యంలో 4-00 గంఃలకు మీడియా సమావేశం నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే ఉద్యమ కార్యక్రమాలను అధికారికంగా ప్రకటించి,ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న 30 ప్రధాన డిమాండ్లపై సమగ్ర నివేదికతో కూడిన వినతిపత్రం (బుక్‌లెట్)ను ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నామని ఏపిపిటిడి(ఆర్టిసి) ఉధ్యోగ సంఘాల జేఏసి రాష్ట్రకన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

ఈ ఆర్టీసీ జేఏసి బుక్‌లెట్‌ను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న మంత్రులు,యం.పి లు,యం.యల్.ఏ& యం.యల్.సి లు మరియు ఆర్టిసి చైర్మన్లను కలిసి అందజేసి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సహకరించాలని కోరనున్నామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *