-కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ 38వ వార్డ్ సచివాలయం నందు విధులు నిర్వహిస్తున్న వార్డ్ సచివాలయ ఇన్ ఛార్జ్ పరిపాలన కార్యదర్శి ఎన్. రాజీవ్ కుమార్, వార్డ్ విద్య మరియు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి వి.రాణి వార్డ్ ప్రణాళిక మరియు క్రమబద్దికరణ కార్యదర్శి ఎ.నాగలక్ష్మి లను విధి నిర్వహణలో అలసత్వం వహించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలుగజేసినందులకు కమిషనర్ వారి ఆదేశాలకు అనుగుణంగా విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారిచేయుట జరిగింది.
38వ వార్డ్ సచివాలయం నందు వాలెంటరిగా విధులు నిర్వహిస్తున్న టి. సారిక విధులకు గైరుహజరు అయిన కాలమునకు కూడా హాజరు అయినట్లుగా తెలియపరుస్తూ, ప్రతి నెల పూర్తి గౌరవ వేతనము చెల్లింపు చేయుట ద్వారా మే 2021 నుండి సెప్టెంబర్ 2021 వరకు 25,000 రూపాయలు దుర్వినియోగం చేసినట్లుగా వచ్చిన అభియోగాలపై అదనపు కమిషనర్ (జనరల్) డా.జె. అరుణ వారి ప్రాదమిక విచారణ యందు నిర్ధారణ కావటంతో సదరు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ, ఈ విషయమై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి 7 రోజులలో సమగ్ర నివేదిక సమర్పించుటకై జోనల్ కమిషనర్ -1 వారిని విచారణ అధికారిగా నియమించినారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా నెలకొల్పిన సచివాలయ వ్యవస్థ నందలి ఉద్యోగులు వారి యొక్క విధి నిర్వహణలో ఉద్యోగ నిబంధనలు పాటించుచూ ప్రజలకు సకాలంలో సేవలు అందేలా అంకిత భావంతో పని చేయాలనీ లేనిచో అట్టి వారిపై క్రమ శిక్షణ చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించినారు..