విజ్జేశ్వరం (మద్దూరు), నేటి పత్రిక ప్రజావార్త :
ఏదైనా ఒక సంఘటన జరిగితే నిర్వహణ లోపం ప్రధాన కారణం కావచ్చు నని గెయిల్ జనరల్ మేనేజర్ (నిర్వహణ) బి ఎన్ రావు పేర్కొన్నారు. గురువారం స్థానిక గేయిల్ (Gail) టెర్మినల్, ఏ పి జి పి సి ఎల్ , విజ్జేశ్వరం .. మద్దూరు గ్రామం నందు మాక్ డ్రిల్ల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వివిధ పరిశ్రమలతో సమన్వయం చేసుకుంటూ, వారికి అవసరమైన సమయంలో అదే తీరులో గెయిల్ కూడా సహకారాన్ని అందిస్తామని తెలిపారు. పరిశ్రమల్లో ఎటువంటి ప్రమాదాలు జరిగినా తక్షణమే స్పందించే వ్యవస్థను స్వీయ విధానంలో అభివృద్ధి చేసుకునేందుకు ఎప్పుడూ ముందు ఉంటామన్నారు. పైప్ లైన్స్ వెళ్లే దారిలో ఆక్రమణలు నియంత్రణ కోసం జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకారాన్నీ అందించాల్సి ఉందన్నారు. పైప్ లైన్స్ ద్వారా గ్యాస్ సరఫరా ను రిమోట్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చెయ్యడం జరుగుతుందని తెలిపారు. ఎపి గ్యాస్ ఫారం పరిశ్రమ ఉన్నతాధికారి చిట్టిబాబు మాట్లాడుతూ, గెయిల్ వ్యవస్థ ను అత్యంత భద్రతతో కూడి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మాక్ డ్రిల్ ప్రమాద స్థాయి ని తగించే దిశలో నిర్వహిస్తున్న ట్లు, ప్రమాదాలు జరగ కూడదనే కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నగరం సంఘటన తర్వాత మరో ఘటన జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు వారి పరిశీలించిన అంశాలను సమావేశం లో ప్రస్తావించారు. ఒక రహస్య పరిశీలకుడు ని నియమించి మాక్ డ్రిల్ల్ సందర్భంగా జరిగిన లోపాలను గుర్తించి నివేదిక రూపొందించి భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరిగితే ఏవిధంగా అడుగులు వేసి, ప్రమాద స్థాయి తగ్గించాలన్నదే ఇటువంటి మాక్ డ్రిల్స్ ప్రధాన ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. గ్యాస్ లీకేజీ సమయంలో చేపట్టే ముందస్తు నియంత్రణ చర్యలను క్షేత్రస్థాయిలో 21 నిమిషాల్లో అదుపులోకి తీసుకొని రావడం మంచి పరిమాణం అని పేర్కొన్నారు. మాక్ డ్రిల్ల్ నిజంగా సంఘటన జరిగితే స్పందించే విధానంలో ఉండాల్సి ఉందన్నారు. వాహనాలు బోల్తా పడిన ఆయిల్ లీకేజీ సమయంలో కొందరు ఆయిల్ ని ఇంటికి తీసుకుని వెళ్లి వాడడం ప్రమాదకరం అని తెలిపారు. సేఫ్టీ అనేది నిరంతర ప్రక్రియ అని, పరిశ్రమ ల చట్టం ప్రకారం రెగ్యులర్ మూడు నెలలకు ఒక్కసారి భద్రతా ప్రమాణాలను పరిశీలించుకోవాల్సి ఉందన్నారు. మాక్ డ్రిల్ల్ కోసం నిపుణులు సలహాలు సూచనలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. నగరం సంఘటన తర్వాత మరో ఘటన జరగకుండా గైయిల్ సమర్ధవంతమైన చర్యలు చేపట్టారని అభినందించారు. సమయ పాలనతో ప్రమాద స్థాయి గణనీయంగా తగించగలం అనేది మాక్ డ్రిల్ ద్వారా తెలుసుకో గలిగామన్నారు. మాక్ డ్రిల్ వంటి కార్యక్రమాలు పగలు మాత్రమే చెయ్యకుండా, రాత్రి సమయాల్లో కూడా నిర్వహించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. వాటి అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి, వినియోగం, సరఫరా అంశాలపై దృష్టి సారించాలి. ప్రమాదాలు జరిగిన వాస్తవాలు మీడియా మాధ్యమం ద్వారా ప్రజల ముందు ఉంచడం సత్పలితాలను ఇస్తాయని పేర్కొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా స్టాల్ :
మాక్ డ్రిల్ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్ నందు సహజ వాయువు, భద్రతా నియమాలు, గ్యాస్ లీక్ అయిన సందర్భంలో తీసుకోవాలసిన చర్యలు, చేయకూడని వాటిపై అవగాహన కల్పించారు.అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే పరికరాలతో స్టాల్ తో ప్రదర్శన ఏర్పాటు చేశారు. పిగ్గింగ్ నిర్వహణ సమయంలో వాడవలసిన వ్యక్తిగత సురక్ష సాధనములు, అగ్నిమాపక, భద్రత పరికరాలు తో స్టాల్ ఏర్పాటు చేశారు.ప్ఫైర్ సూట్, గ్యాస్ లీక్ డిటెక్టర్, పైప్ లైన్ గుర్తించే సూచికలు, స్వీయ రక్షణ కలిగిన శ్వాస పరికరాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సి ఐ వై వి రమణ, ఏ డి ఫైర్స్, నిడదవోలు శ్రీనివాసులు, కొవ్వూరు డిఎఫ్ ఓ సత్యానంద్ , కొవ్వూరు పిఆర్వో లక్ష్మణాచార్యులు, ఎస్ ఐ సతీష్, ఎపిడిసిఎల్ – రమణా రెడ్డి,పి. వెంకేశ్వర్లు, డిజిఎం రాజారావు , డిజిఎం తాటిపాక, ఎస్వీ రెడ్డి.. డిజిఎం ఫైర్, తదితరులు ప్రసంగించారు.