Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి : జేసీ ఎల్. శివశంకర్

చాట్రాయి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని మరింత మెరుగుపరిచే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలనీ జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అధికారులను ఆదేశించారు. చాట్రాయి మండలం పోలవరం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలను శనివారం జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి మనబడి-నాడు -నేడు , మధ్యాహ్న భోజన పధకంలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో తరగగతి గదులను పరిశీలించి ఉపాధ్యాయులు విద్యా బోధన చేసే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించి, విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ దిశగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టిందన్నారు. . పాఠశాలల పరిసరాలను నాడు-నేడు కార్యక్రమం కింద ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు, ల్యాబ్, లైబ్రరీ, క్రీడా సౌకర్యాలను కూడా పూర్తి స్థాయిలో కల్పిస్తున్నదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని పూర్తి స్థాయిలో అమలు జరిగేలా ఉపాధ్యాయులు చూడాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య గతంలో కన్నా చాలా రేట్లు పెరిగిందన్నారు. పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలో ఉందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అభ్యసించే పిల్లలకు పూర్తి స్థాయి పోష్టికాహారాన్ని జగనన్న గోరుముద్ద కార్యక్రమం ద్వారా అందిస్తున్నదని, ఈ పధకంలో ప్రభుత్వం నిర్దేశించిన కింద మెనూ ను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఉపాధ్యాయులు పాఠశాల సమయాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో పారిశుధ్య పరిస్థితులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ వెంట తహసీల్దార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *