మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నివర్గాల అభివృద్దికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. శనివారం ఆయన మచిలీపట్నం నియోజకవర్గంలోని వాడపాలెం, భోగిరెడ్డిపల్లి, పెదయాదర గ్రామాలలో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో ముఖ్యఅథితిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత ఆయన వాడపాలెం గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయంను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం భోగిరెడ్డిపల్లిలో 14. 50 లక్షల రూపాయల వ్యయంతో వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, సహకార సంస్థ విలువలతో కూడిన ఒక గొప్ప వ్యవస్థ అని , సామాజిక, ఆర్ధిక, ఏకీభావం అనే విలువలను ఈ వ్యవస్థ అందిస్తుందని నిజాయితీ, నిష్కపటం, సాంఘిక బాధ్యత, పరోపకారం అనే నైతికవిలువలను సహకార సభ్యులు విశ్వసిస్తారని పేర్కొన్నారు. ఈ సంఘాలు రైతులకు రుణాలు, ఎరువుల పంపిణీ, ధాన్య సేకరణ చేస్తాయిని సహకార వ్యవస్థ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి రైతునూ ప్రభావితం చేస్తుందన్నారు. రైతు కూడా ఈ వ్యవస్థమీద ఆధారపడి ఉంటాడని పలు రాష్ట్రాల్లో ఈ సహకార వ్యవస్థ ద్వారా రైతులు సంపన్నులయ్యారని మంత్రి తెలిపారు . మహారాష్ట్రలో చక్కెర సహకార వ్యవస్థ ద్వారా మరాఠా సమాజం అత్యధికంగా లబ్ధి పొందిందని . మహారాష్ట్ర రాజకీయ వ్యవస్థను శాసించే విధంగా అక్కడి సహకార వ్యవస్థ తయారయిందన్నారు . ఈ కార్యక్రమంలో డి సి ఓ రవికుమార్, సర్పంచ్ గరికిపాటి శ్రీరాములు, అనిశెట్టి పాండురంగారావు, మోతుకూరి జనార్దనరావు, యార్లగడ్డ పూర్ణచంద్రరావు, బ్యాంకు మేనేజర్ ఫణి కృష్ణ, ఆర్ ఐ వనజాక్షి, వి ఆర్ ఓ రంగారావు తదితరులు పాల్గొన్నారు.
తర్వాత పెదయాదర గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయంను, 21. 80 లక్షలతో రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. అలాగే వాడపాలెం చిన యాదర లో తాగునీటి అవసరాల కోసం ఫిల్టర్ మీడియా మైక్రో ఫిల్టర్ల ఏర్పాటు కోసం 12 లక్షలు అంచనా అవుతుందని గ్రామీణ నీటి సరఫరా అధికారులు తెలియచేయడంతో జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ఆ నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరినట్లు చెప్పారు. పెదయాదర వాడపాలెంలో పొలాలకు వెళ్లే రోడ్లు ,డొంక రోడ్లు కావాలని పలువురు గ్రామస్తులు కోరిన కారణంగా వరికోతలు ముగిసిన తర్వాత పొలాల ఆరుదల అనంతరం సంబంధిత అధికారుల చేత పరిశీలించి ఆ పనులు చేపట్టనున్నట్లు మంత్రి పేర్ని నాని చెప్పారు.
అనంతరం జరిగిన గ్రామసభలో ప్రజలు పలు విజప్తులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తనకు వికలాంగుల పింఛన్ ఆగిపోయిందని కన్నమరెడ్డి కుటుంబరావు మంత్రికి తెలిపారు. తమ చెరువులో నీళ్లు చాల మురికిగా ఉంటున్నాయని స్నానం చేయాలంటే ఆ నీళ్లు వాడలేని పరిస్థి ఉందని పశువులు చెరువులలో దిగుతున్నాయని ముళ్ళపూడి సుబ్బారావు చెప్పారు. కార్తీకమాసంలో కాలువలో దిగి పూజలు నిర్వహించుకొనేందుకు గట్టు అంచున మెట్లు కట్టించాలని కొట్టే అమ్మడు కుమారి అనే మహిళ తెలిపింది. తమ గ్రామంలో ఇంటర్నెట్ అందడం లేదని వైఫై కనెక్షన్ వచ్చేలా సహాయం చేయాలనీ గుండు రాఘవేంద్ర అనే యువకుడు మంత్రిని కోరారు. ఈ గ్రామసభలో మచిలీపట్నం మాజీ జడ్పిటీసి సభ్యలు లంకె వెంకటేశ్వరావు ( ఎల్వీయార్ ) , వైస్సార్ పార్టీ అధికార ప్రతినిధి మాదివాడ రాము, డ్వామా పి డి, మచిలీపట్నం ఎంపీడీఓ జి. సూర్య నారాయణ, స్థానిక వైస్సార్ సి పి నాయకులు అర్జా శంకరరావు, అర్జా మురళీ తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ఎడిబి 4 వరసల రహదారి పనుల పురోగతి పై క్షేత్ర స్థాయిలో ఉప ముఖ్యమంత్రి తనిఖీ
-గ్రామాల వారీగా పనుల పురోగతిని వివరించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజానగరం, రంగంపేట, నేటి పత్రిక …