తాడేపల్లిగూడెం /తణుకు /అత్తిలి /పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త :
పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాదరాజు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ, తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, స్తానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారు. పశ్చిమగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు.
తాడేపల్లిగూడెం నియోజవర్గం పెంటపాడు మండలం బి.కొండేపాడు, తణుకు నియోజవర్గం తణుకు మండలం దువ్వ,అత్తిలి మండలం వరిఘేడు, ఇరగవరం మండలం కావలిపురం,పెనుమంట్ర మండలం సోమరాజు ఇలెంద్ర పర్రు, మల్లిపూడి, జుత్తిగ,పెనుమంట్ర, ఆలమూరు గ్రామాలలో లో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను రైతులు మంత్రులకు చూపారు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని అన్నారు.
తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ లోనే చెల్లింపులు చేస్తున్నామన్నారు. గులాబ్ తుపాన్ సమయంలో పంట నష్టపోయిన 45రోజుల్లోనే రైతులకు చెల్లింపులు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు.పంట నష్టపోయిన ప్రతీ ఎకరా పంటను నమోదు చేయాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు. రైతులు అధైర్యపడవద్దు అని ప్రతీ రైతును ఆదుకుంటామని అన్నారు.తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల అకాలవర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించటం కోసం రావడం జరిగిందన్నారు. ముఖ్యంగా స్వర్ణ రకం ధాన్యం పంటకు ఎక్కువ నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు. ఎకరం కూడా నష్ట పోకుండా రెమ్యునరేషన్ (గణన) చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. రైతులు ఒక ఎకరం పంట కూడా నష్టపోకుండా పంట నష్టం అంచనా వెయ్యలని సిఎం ఆదేశించారన్నారు. గణనను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు లో భారీ మార్పులు చేశామన్నారు. ధాన్యం కొనుగోళ్లను రైతు భరోసా కేంద్రాల ద్వారా చేపట్టామన్నారు.ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్లోనే రెండు నెలలు లోపుగా పంట నష్టపరిహారం చెల్లిస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిహారాన్ని అందిస్తున్న ఘనత తమదేనని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయం లో రైతులు అధైర్యపడవద్దని తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నామని మంత్రి అన్నారు.కౌలు రైతులకు సహకరించాలని మంత్రి కురసాల కన్నబాబు విజ్ఞప్తి చేశారు. ఎక్కువ మంది కౌలు రైతులకు పంట నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు. కౌలు రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని భూ యజమానులకు కోరినట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ,తణుకు శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, జేసి రెవెన్యూ డా.బి ఆర్ అంబేద్కర్, జేడీఏ జగ్గారావు, స్థానిక నాయకులు ఉన్నారు.
Tags penumantra
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …