విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మ జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న పూలే కాంస్య విగ్రహానికి జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, నగర కమిటీ, అమ్మ వారి ధార్మిక సేవ మండలి సభ్యులు కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థులు మరియు యువ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అట్టడుగు వర్గాలు సామాజికంగా ఎదగాలని రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని ఉన్నత విద్యను ప్రతి ఒక్కరూ అభ్యసించాలని, నిరంతరం పోరాడినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, మహిళలకు విద్య ఎంతో అవసరమని, మొట్టమొదటి పాఠశాలను కూడా వారే స్థాపించారని కొనియాడారు. పూలే ఆశయాలను సిద్ధాంతాలను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆచరిస్తున్నారని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతానికి పైగా బలహీనవర్గాలకు చెందిన వారికే సీట్లు కేటాయించారని తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి పడిపోవడం వల్ల 18 వేల మంది బీసీలు రాజ్యాధికారానికి దూరమయ్యారని బీసీలకు జగన్మోహన్ రెడ్డి బిక్షా అవసరం లేదని జగన్ మోహన్ రెడ్డి కి బీసీలు మద్దతిచ్చి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారన్న విషయం మర్చిపోవద్దు అన్నారు. ఓట్ల కోసం సీట్ల కోసం మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పదేపదే బీసీల అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని చెబుతూ బ్యాక్ బోన్ క్లాస్ జగన్మోహన్ రెడ్డి చెబుతూ బీసీల వెన్నుముక వీరిచేస్తున్నారని, పేదింటి ఆడపిల్లలకు పెళ్ళికానుక పధకం రద్దు చేశారని, సబ్సిడీ రుణాలు మంజూరు ఎత్తి వేశారని, విదేశీ విద్యా పథకం అటకెక్కించారని, ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ కు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు పేద విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కోచింగ్ సెంటర్లలో ఐఏఎస్ కోచింగ్ తీసుకునేందుకు వారిని దూరం చేశారని, బీసీ జనాభా గణన చేపట్టాలని అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం గారు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ సమాచారం సేకరించి సుప్రీంకోర్టులో ఫైల్ చేసి ఉంటే బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కోల్పోయే వారు కారని, జగన్మోహన్ రెడ్డి కి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పదేపదే బీసీలను మభ్యపెడుతున్నారని వారి అభివృద్ధి సంక్షేమం రాజ్యాధికారానికి చిత్తశుద్ధితో ఏనాడు పనిచేయలేదని తెలియజేశారు. బీసీలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలను కుయుక్తులను గ్రహించి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో,విజయవాడ నగర కమిటీ సభ్యులు వెన్నా శివశంకర్, శనివారపు శివ, కృష్ణ మోహన్, మురళి కృష్ణ, పల రజిని, అమ్మ వారి ధార్మిక సేవ మండలి సభ్యులు పసుపులేటి విజయలక్ష్మి, ప్రముఖ న్యాయవాది పిళ్ల శ్రీనివాసరావు బీసీ సంఘo విజయవాడ మహిళా అధ్యక్షురాలు జ్యోతి, జనసేన నాయకులు బొలిశెట్టి వంశీ కృష్ణ, పిళ్లి శ్రీనివాసరావు , కూరాకుల సురేష్, బాదరాల శివ ,రాము, మరూపిళ్ల చిన్నారావు, రాజా నాయుడు , నూనె సోమశేఖర్, గంగాధర్, వడ్డాది రాజేష్ ,పండు, సాంబశివ, దేవ కృష్ణ, రాజేష్, పొట్నూరి ప్రసాద్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …