విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
50 ఏళ్ల క్రితమే చదువు గొప్పదనాన్ని తెలియజేసి, మహిళలు సైతం చదువుతోనే సమగ్రాభివృద్ధి సాధిస్తారని చాటి చెప్పిన మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన వైస్సార్సీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ , ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ . బుచ్చిబాబు మాట్లాడుతూ చదువుతోనే సమాజంలో వెలుగులు నిండుతాయని, చదువు మనిషి ఉన్నతికి దోహదపడుతుందని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. సమాజంలో కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసారు అని అన్నారు. ప్రతి ఒక్కరు మహాత్మా జ్యోతిరావు పూలే బాటలో నడిచి సమాజాభివృద్ధికి పాటు పడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అంబడపుడి నిర్మలాకుమారి,కలపాల అంబెడ్కర్,వైస్సార్సీపీ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు,డేవిడ్ రాజు,రామాయణపు శ్రీనివాస్,కొరివి చైతన్య వర,ఉకోటి రమేష్,చిన్నబాబు,కోలా ఉమా,సొంగా రాజ్ కమల్,ప్రభు,బచ్చు మురళి,యర్రబోతు శ్రీను మరియు యలమందా రెడ్డి పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …