Breaking News

కృష్ణా జిల్లాకు రూ.24,675 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక

-ప్రాధాన్యత రంగం, వ్యవసాయం, పంట రుణాలు, ఎంఎస్‌ఎంఈలకు ప్రాధాన్యత
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.24,675 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కార్యచరణ ప్రణాళికలో భాగంగా పీఎంఈజీపీ, పీఎం ఎఫ్ఎంఈ, క్రాప్ ఇన్సూరెన్స్ పురోగతిపై ప్రధానంగా చర్చించారు. అనంతరం కృష్ణాజిల్లా 2026–27 ఆర్థిక సంవత్సర వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ రంగాల అభివృద్ధికి, ముఖ్యంగా వ్యవసాయం, పంట రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన రుణ సదుపాయాలను కల్పించేందుకు ఈ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.

2026–27 వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యతా రంగాలకు రూ.18,224 కోట్లు కేటాయించగా, ఇందులో వ్యవసాయ రంగానికి రూ.12,719 కోట్లు, పంట రుణాలకు రూ.6,785 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి రూ.4,250 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించినట్లుగా పేర్కొన్నారు.

జిల్లాలోని రైతులు, చిన్న వ్యాపారస్తులు, వివిధ వర్గాల ఆర్థిక ఎదుగుదలకు ఈ రుణ ప్రణాళిక ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సమావేశంలో ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఆర్ ప్రదీప్ కుమార్, ఆర్.బి.ఐ సీడీవో పి ఎలమంద, నాబార్డ్ డిపిఎం అనిల్ కాంత్, లీడ్ బ్యాంకు మేనేజర్ సి రవీంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్ వెంకట్రావు, డిఆర్డిఏ, మెప్మా పీడీలు హరిహరనాథ్, సాయిబాబు, ఉద్యాన వ్యవసాయ శాఖ అధికారులు జే జ్యోతి, జ్యోతి రమణి, తదితర శాఖల అధికారులు బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *