-దుష్ట పరిపాలన అంతం కోసం పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం మరువలేనిది
-చంద్రబాబు–పవన్ కళ్యాణ్ మైత్రి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది
-కూటమి ఐక్యతతోనే ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలం
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. తిరువూరు జనసేన పార్టీ ఇంచార్జి మనుబోలు శ్రీనివాసరావు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ… ఎన్టీఆర్ జిల్లా కూటమి తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.
గతంలో రాష్ట్రంలో సాగిన దుష్ట పరిపాలనకు చరమగీతం పాడేందుకు పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం, కూటమి ఏర్పాటులో ఆయన పోషించిన కీలక పాత్రను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరువరని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.
ఎలాంటి వ్యక్తిగత లేదా రాజకీయ లాభాలను ఆశించకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా కలిసి పనిచేస్తేనే ఆంధ్రప్రదేశ్‌ను మరింత అభివృద్ధి చేయగలమని ఆలోచించిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.
టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా అండగా నిలబడి పార్టీకి, నాయకత్వానికి బాసటగా నిలిచిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కేశినేని చిన్ని పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు, ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్న ఆయనలాంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో అవసరమని అన్నారు.
పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పని రాష్ట్ర ప్రయోజనం, ప్రజల ప్రయోజనం కోసమేనని ఎంపీ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత పవన్ కళ్యాణ్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న మైత్రి, సమన్వయం ఎంతో గొప్పదని కేశినేని చిన్ని అన్నారు. ఈ మైత్రి రాష్ట్ర అభివృద్ధికి మరింత బలాన్ని ఇస్తుందని తెలిపారు.
కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ ఐక్యంగా, సమన్వయంతో కలిసి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమానంతరం యువత అందరితో ఎంపీ చిన్ని ప్రత్యేకంగా కూర్చుని మాట్లాడారు జెన్ జీ ఆలోచనలతో దేశాన్ని మరింతగా ప్రభావితం చేయాలని కోరారు యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని తెలియజేశారు వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ సెల్ఫీ వీడియోను ఆయన చరవాణితో చిత్రీకరించారు యువత కేరింతలతో సందడి చేశారు
ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మనుబోలు శ్రీనివాసరావు తిరువూరు మండల పార్టీ ప్రెసిడెంట్ పుల్లారావు, ఏ కొండూరు మండల పార్టీ ప్రెసిడెంట్ విజయ్ ఏఎంసి డైరెక్టర్ మాధవరావు పిఎసిఎస్ చైర్మన్ సీతారామస్వామి పిఎసిఎస్ డైరెక్టర్లు నవీన్ కొండబాబు, జనసేన పార్టీ పట్టణ ముఖ్య నాయకులు లింగనేని సుధాకర్ పసుపులేటి రవీంద్ర, రామిశెట్టి జగన్ నామా నాగరాజు పసుపులేటి పండు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News