విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడిని జయించి, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి వ్యాయామం ఏకైక మార్గమని ఇండియన్ ఫిజిక్స్ జిమ్ నిర్వాహకులు రాకోటి దుర్గ ఆంజనేయులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 4వ తేదీన విజయవాడలోని ఎస్.ఈ.ఆర్ సెంటర్, రవీంద్ర భారతీ స్కూల్ ఎదురుగా ఉన్న రాఫా హాస్పిటల్ నాలుగో అంతస్తులో ‘ఇండియన్ ఫిజిక్స్ యూనిసెక్స్ జిమ్’ నూతన బ్రాంచ్‌ను ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గోడవల్లి నర్సయ్య, మాజీ సర్పంచ్ హరిబాబు ముఖ్యఅతిథులుగా విచ్చేయగా, నిర్వాహకుల తల్లిదండ్రులు రాకోటి అప్పలనాడు, లక్ష్మి, జ్యోతిప్రజ్వలన చేసి జిమ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా దుర్గ ఆంజనేయులు, మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా ఫిట్‌నెస్ రంగంలో ఉన్న తనకు ఇది రెండో బ్రాంచ్ అని, ఇప్పటికే రామవరపాడులో మొదటి బ్రాంచ్ విజయవంతంగా నడుస్తోందని తెలిపారు. జిమ్ విశేషాలు తెలుపుతూ… మానసిక ప్రశాంతత జిమ్ అనేది కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, అది మెదడు పనితీరును మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గించే అద్భుత సాధనమని ఆయన వివరించారు. అత్యాధునిక పరికరాలు జిమ్‌లో స్క్వాడ్ మెషిన్, బటర్‌ఫ్లై, చెస్ట్ బెంచెస్ (ఇంక్లైన్, డిక్లైన్), లాట్ పుల్ వంటి అత్యాధునిక వ్యాయామ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక శిక్షణ బరువు తగ్గాలనుకునే వారికి వారి శరీర తత్వానికి అనుగుణంగా ప్రత్యేక ‘పర్సనల్ ట్రైనింగ్’ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రారంభ ఆఫర్ క్రింద నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా యువతకు ప్రత్యేక రాయితీలను ప్రకటించారు. సాధారణంగా రూ. 2000 నుండి రూ. 2500 వరకు ఉండే నెలవారీ ఫీజును, ప్రారంభ ఆఫర్ కింద కేవలం రూ. 1500లకే అందిస్తున్నట్లు తెలిపారు. ఈఆఫర్ ఒక నెల రోజుల పాటు అందుబాటులో ఉంటుందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బంధు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News