విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం స్థానిక రామవరప్పాడు లో వేమినేని రామస్వామి వీధిలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యాదవ సంఘం అధ్యక్షులు కొంగన రవికుమార్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలు 24 సంవత్సరాలుగా రామవరప్పాడు, యామనేని రామస్వామి వీధిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి స్థానిక పెద్దలు, సంఘ నాయకులు ఎంతో కృషి చేశారని వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమములో ముఖ్య అతిథులను, నాయకులను మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ముఖ్య అతిథులుగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు విచ్చేసి స్వామిని, దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్లారని ఆయన చెప్పారు. సాయంత్రం ఉట్టి కొట్టే ఉత్సవ కార్యక్రమం భక్తుల ఆనందడోలికల నడుమ కనుల పండుగుగా జరిగిందని అని తెలిపారు. తదనంతరం వక్తలు, యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ కృష్ణ జన్మాష్టమి వేడుకలు 24వ వార్షికోత్సవం ఇంత ఘనంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీకృష్ణ భగవానుడు ప్రజలకు భోగభాగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని, మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, నగర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు, స్థానిక పెద్దలు, అభిమానులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News