Breaking News

శ్రీ రాధాకృష్ణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ రాధాకృష్ణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శనివారం స్థానిక రామవరప్పాడు, వంతెన సెంటర్ లో 35వ శ్రీకృష్ణ జన్మాష్టమి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా నిర్వాహకులు, రామవరప్పాడు మాజీ గ్రామ సర్పంచ్ వరి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ గత 34 సంవత్సరాల నుండి దిన  దిన ప్రవర్ధమానం అవుతూ ఇప్పుడు 35 సంవత్సరాన్నీ విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుతున్నామని, శ్రీకృష్ణుడు ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతం కాదని ఈ విశ్వానికి మానవాళికి గురువు అని భారతదేశం, ప్రపంచానికి తెలియజేయాలనేదే మా యొక్క భావన అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది వేల మందికి పైగా భక్తులకు కృష్ణ ప్రసాద వితరణ జరిగిందన్నారు. సాయంత్రం ఉట్టి కొట్టే ఉత్సవ కార్యక్రమాన్ని భక్తుల హరే రామ హరే కృష్ణ నామస్మరణ మధ్య అద్భుతంగా జరిగిందన్నారు. ఈ వంతెన సెంటర్ ప్రాంతంలో శ్రీకృష్ణుడు గుడి నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని దానికి స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూడా సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎక్కడ శ్రీనివాసరావు, భక్తుల రాజు, లెక్కల బాలాజీ, భక్తుల గంగాధర్, బండారి నాగ, వేమినేని కిషోర్, మెండే లక్ష్మీనారాయణ, పులి పిచ్చేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *