విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ గులాబీ తోట లోని శ్రీకృష్ణ మందిరంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను దేవాలయం వ్యవస్థాపకులు మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్, నిర్వాహకులు పట్టిపోయిన హరి ప్రసాద్ ఉదయాన్నే అభిషేకం అలంకరణ అర్చన అనంతరం గోపూజ కార్యక్రమాలను నిర్వహించి భక్తుల దర్శనార్థం స్వామి వారిని అత్యంత సుందరంగా అలంకరించి నగర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారిని ఘనంగా ఆహ్వానించి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను వ్యవస్థాపకులు కాకు మల్లికార్జున యాదవ్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2014లో స్థానిక కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ అభ్యర్థన మేరకు ఈ ప్రాంతంలో భగవాన్ శ్రీకృష్ణుడి దేవాలయాన్ని ప్రతిష్టించటం అప్పటినుండి కూడా ఈ ప్రాంత ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో యాదవ సోదరులే కాక ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నమ్మే దేవుడుగా కొనియాడుతున్నారని ఈ కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని ఒక లైన్లో నగర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ చిన్ని నీ ఘనంగా ఆహ్వానించి వారికి స్వామివారి శేష వస్త్రముతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చాలా సుందరమైన మూర్తిభవించిన గొప్ప ఆకర్షవంతంగా ఉన్న ఈ విగ్రహం చాలా మహిమ గా ఉన్నదని ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్నారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, రాధా రంగా మిత్రమండలి చైర్మన్ చెన్నుపాటి శీను, దర్శి వాసు, గన్నే వెంకట ప్రసాద్ అన్, లాకా వెంగళరావు యాదవ్, సుజనా చౌదరి వ్యక్తిగత కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు రాజు సోలంకి జెన్, విజయ కాలేజెస్ ఎండి తట్టి అర్జున్ రావు యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ కన్వీనర్ పెద్దిబోయిన శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ సినీ నిర్మాత జయప్రకాష్ రెడ్డి, కుమార్తె మల్లికా రెడ్డి వృషభ సినిమా దర్శకులు ఉమా శంకర్ ఇంకా అనేకమంది నగర ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News