Breaking News

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు “జాబ్ మేళా”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.11.09.2026 శుక్రవారం ఉదయం 09:00 గంటలకు తిరువూరు లోని శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరువూరు నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి అధికారి చల్లా మధుభూషణ రావు తెలియజేసారు.

ఈ జాబ్ మేళా లో సుమారు 15 ప్రముఖ కంపెనీలు హాజరు అవుతున్నాయి. ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు 10 వ తరగతి, ఇంటర్మీడియట్, ఐ.టి.ఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బి.టెక్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువతి మరియు యువకులు అర్హులని, ఎంపిక అయిన వారికి నెలకు Rs. 12,000/- నుంచి Rs. 50,000/- వరకు వేతనము మరియు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవు.
ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు జాబ్ మేళాకు Resume లేదా Bio Data Form లతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నెంబర్, PAN కార్డ్ కాపీ మరియు సర్టిఫికెట్ల Xerox కాపీలతో రావాలని తెలిపారు మరియు మరిన్ని వివరాలకు సీతా మహాలక్ష్మి 8331890681, మోహనరావు గారు 93465 95070 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *