-కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొగల్రాజపురం బోయపాటి శివరామ క్రిష్నయ్య మున్సిపల్ కార్పోరేషన్ హై స్కూల్ నందు లయన్స్ క్లబ్ అఫ్ విజయవాడ జూబిలీ హరిత ఆద్వర్యంలో “ యోగ శిక్షణ “ తరగతుల ప్రారంభ కార్యక్రమములో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ వారి “యోగ టీమ్ “ నిర్వహించిన యోగాసనాలను తిలకించారు. ముందుగా దేశంలోనే 3వ CLEANEST CITY అవార్డు అందుకున్న కమిషనర్ గారిని పాఠశాల ఉపాధ్యాయని ఉపాధ్యాయులు మరియు లయన్స్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంలో కమిషనర్ మాట్లాడుతూ సమస్యలు వచ్చినప్పడు ఆగకుండా ముందుకు వెళ్ళు వారు విజయం సాధిస్తారని, ప్రతి రోజు యోగ చేస్తే రిలాక్స్ గా ఉంటుందని, డాక్టర్ దగ్గరకు వెళ్లే పని ఉండదని ఏకాగ్రత పెరుగుతుందని, “మానసిక ఉల్లాసానికి ఆరోగ్యానికి యోగా భ్యాసం ఉత్తమ సాధన అన్నారు. అదే విధంగా లయన్స్ డిస్త్రిక్ గవర్నర్, 316 D దేవినేని జొనీ కుమారి, PMJF యోగ శిక్షణ ప్రోసిడింగ్ ఆఫీసర్ లయన్ అంకాల సత్యనారాయణ విద్యార్ధులతో యోగాసనాలు చేయించి యోగ ప్రాముఖ్యత తెలియజేసారు. లయన్ మిరియాల వెంకటేశ్వరరావు, PMJF మరియు AMMA ప్రెసిడెంట్ ఈ పాఠశాలను దత్తత తీసుకోని అనేక సేవా కార్యక్రమములు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, ఇతర లయన్స్ ప్రముఖులు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ KVVR రాజు, పాఠశాల సూపర్ వైజర్లు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు మరియు విద్యార్ధులు తల్లిదండ్రలు పాల్గొన్నారు.