ఉద్యమం ద్వారా ఉద్యోగుల వాణిని ప్రభుత్వానికి వినిపిద్దాం…

-ఉద్యోగుల న్యాయమైన ప్రతి డిమాండ్ ను పరిష్కరించాల్సిoదే- జేఏసీనేత ఎ విద్యాసాగర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణిని విడనాడి వారి న్యాయమైన ప్రతి డిమాండ్లను పరిష్కరించే వరకు ఉవ్వెత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉద్యోగుల వాణిని ప్రభుత్వానికి వినిపిస్తామని ఏపీ జేఏసీ కృష్ణాజిల్లా చైర్మన్ ఎ విద్యాసాగర్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కొరకు ఏపీ జెఎసి, ఏపీ జేఏసీ అమరావతి సంయుక్తంగా ఇచ్చిన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఆదివారం గాంధీనగర్ లోని ఏపీ ఎన్ జీఓ హోమ్ నందు జిల్లా జేఏసీ నాయకత్వం అత్యవసర సమావేశం అయింది.అనంతరం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా చైర్మన్ ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు పరచక పోగా ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలను కూడా ఇవ్వక పోవడం దురదృష్టకరమన్నారు. దీనిపై ఉద్యోగులు పెన్షనర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చినా స్పందన కరువైందని అన్నారు. ఉద్యోగులలో ఉన్న వ్యతిరేకతను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర నాయకత్వం నిరసన కార్యక్రమాలను పిలుపునివ్వడం జరిగింది అన్నారు. రాష్ట్రంలో ఉన్న 13లక్షల ఉద్యోగులను సమాయత్త పరిచేందుకు కార్యక్రమాలను చేపట్టమన్నారు. 2018 జూలై నుంచి పీఆర్సీ అమలు చేయలేదని, ఇప్పటి వరకు పీఆర్సీ రిపోర్టు బయటపెట్టలేదని, ఎ రాష్ట్రంలోని 7 విడుతల కరువు భత్యం బకాయిలు పడిన పరిస్థితి లేదని ఇన్ని డీఎలు బకాయిలు పడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఏపీ ప్రభుత్వం అని అన్నారు. సీపీఎస్ ను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా చేయకపోవడం బాధాకరమన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామన్న హామీని కూడా గాలికొదిలేశారు అన్నారు. ఎపీ జిఎల్ ఐ , జీపీఎఫ్ లో దాచుకున్న డబ్బులు ఉద్యోగులు తీసుకునే అవకాశం లేదని, 1,100 కోట్ల రూపాయల పైగా లోన్ దరఖాస్తులు ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయన్నారు. పీఆర్సీ నివేదిక ను ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. . తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉద్యమం మరొకటి మార్గం కనిపించడం లేదని అన్నారు అందుకే రూపొందించడం జరిగింది అన్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7నుంచి ఆందోళన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 7తేదీ నుంచి 10 తేదీ వరకు నల్ల బాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతామని, 13వ తేదీన అన్ని తాలూకా డివిజన్ కేంద్రాలలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని, 16వ తేదీన అన్ని తాలూకా కేంద్రాల్లో, హెచ్ ఓ డి కార్యాలయాలు ఆర్టీసీ డిపోల వద్ద ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు ధర్నాలు నిర్వహిస్తామని, 21వ తేదీన జిల్లా కేెంద్రాలలోను ధర్నా లను నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా విజయవాడలో వేలాది మంది ఉద్యోగులతో మహా ధర్నా నిర్వహించనున్నట్లు వివరించారు. ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఉద్యోగులందరికీ విజ్ణప్తి చేస్తున్నామని విద్యాసాగర్ తెలిపారు.

ఉపాధ్యాయ సంఘ నేత సుందరయ్య మాట్లాడుతూ మేము ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చినా కూడా సమస్యలను పరిష్కరించలేదని, చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో నాలుగేళ్లయునా పీఆర్సీ రాలేదని, మా వేతనాలు కూడా ఒకటో తారీఖున ఇవ్వని పరిస్థితి ఉందని, మా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతున్నామని లేని పక్షంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలను కలుపుకుని ఆందోళనలో పాలు పంచుకునేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారన్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె దాలినాయుడు మాట్లాడుతూ పెన్షనర్లు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలమైందన్నారు. పెన్షనర్లు సకాలంలో పెన్షన్ చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు ఈ పరిస్థితులలో రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు పెన్షనర్లు నిరసన కార్యక్రమంలో పాల్గొని పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నామన్నారు. 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు వి సాయిరాం మాట్లాడుతూ చాలీ చాలాని జీతాలతో జీవితం గడుపుతున్నరని, ఉద్యోగులకు కనీసం వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న మన్నారు. పిఆర్సి, డి ఏ ల అమలు చేయకపోవడం వలన ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కొనేది నాలుగోవ తరగతి ఉద్యోగులేనని అన్నారు. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడంలో సాధించుకునేందుకు జేఏసీ ఇచ్చిన ఎటువంటి కార్యచరణ లోనైనా పాల్గొనేందుకు నాల్గవ తరగతి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

మీడియా ప్రతినిధుల సమావేశంలో జేఏసీ నేతలు డి శ్రీనివాస్ ఏ సాంబశివరావు హరి ధర్మేంద్ర అక్కిరాజు రాజ్ కుమార్ సతీష్ , వి లీలా ప్రసాద్ కి శ్రీనివాసరావు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా నేతలు సిహెచ్ శ్రీరామ్ , బి సతీష్ కుమార్, మధుసూదన్ రావు నగరశాఖ అధ్యక్ష కార్యదర్శులు జె స్వామి, కె సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *