అంగన్వాడీ కేంద్రాల ద్వారా సమగ్ర మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు మండల పరిధిలో ఎటువంటి మాతా శిశు మరణాలు లేకుండా చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించి వారి ఆరోగ్యాలను కాపాడ్డం జరుగుతోందని ఐ సి డి ఎస్ (శిశు అభివృద్ధి పధక అభివృద్ధి అధికారిణి) డి. మమ్మీ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. కొవ్వూరు మండలం లో 114 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా యని అని మండలం లో ఎటు వంటి మాతా శిశు మరణాలు లేకుండా గర్భిణీ స్త్రీలకు, బా లింత లకు పౌష్టికాహారాన్ని అందించి వారి ఆరోగ్యాలను కాపాడ్డం జరుగుతోందన్నారు. తల్లులు ఆరోగ్యం పొందేలా చూసుకోవడం జరుగుతోందన్నారు. వైద్యపరంగా ఆరోగ్యాన్ని పరిశీలించి, శిశు మరణాలు, ప్రసూతి మరణాలు నియంత్రణ కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. తల్లులకు అందించే ఆహారం లో నాణ్యత, మెరుగైన ఫలితాలు కోసం ఇచ్చే ఆహార పదార్థాలు విషయంలో ఆమోద యోగ్యత ను మెరుగు పరచడం జరుగుతోందన్నారు. అంగన్వాడీ కేంద్రాలను అభి వృద్ధి పధంలో నడిపించి రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీ లను, బాలింతాలను, 0 నుండి 6 సంత్సరాల వయిస్సు గల పిల్లలు వరకు జగనన్న మాతా శిశు సంరక్షణ పౌష్టికాహాన్ని అందించి వారి ఆరోగ్యా లను పరిరక్షించేందుకు శిక్షణ తరగతులు చేపదుతున్నమన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో తల్లుల నమోదును మెరుగు పరచి వారికి ఆరోగ్య వంతమైన పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. . మండలం లో 1177 మంది గర్భిణీ,మరియు పాలిచ్చే తల్లులకు వై. ఎస్. ఆర్. కిట్లు ద్వారా బియ్యం, నూనే, కంది పప్పు, నెలకు సరిపడే గుడ్లను ఇచ్చి వారి ఆరోగ్యాన్ని పరిరక్షణకు చర్యలు చేపట్టామన్నారు. మండలం లోని 0 నుండి 6 సంత్సరాల వరకు 5519 మంది పిల్లలలో , 0 నుండి 3 సంత్సరాల వరకు గల వారికి బాలామృ తం, గుడ్లు, పాలు అందచేస్తున్న ట్లు తెలిపారు. అదే విధంగా 3 సంత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు హాట్ కూకేడ్ మీల్స్, పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఫ్రీ స్కూల్స్ ను అంగన్వాడీ కేంద్రాలతో అనుసంధానం చెయ్యడం జరిగిందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *