స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించండి. అధికారులకు ఆర్డిఓ. కె. రాజ్యలక్ష్మీ ఆదేశం…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, జాప్యం లేకుండా సత్వరమే వాటిని పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన అర్జీదారులు ఎంతో ఆశతో సమస్యలు పరిష్కారంకోసం కార్యాలయాలకు వస్తుంటారని వారిని పలుమార్లు కార్యాలయాల చుట్టూ త్రిప్పుకోకుండా ధరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. స్పంధన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అర్జీ తీసుకువస్తే తక్షణమే వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈరోజు స్పందన కార్యక్రమంలో 16 ధరఖాస్తులు అందాయని ఆర్.డి.ఓ తెలిపారు.
స్పందన కార్యక్రమంలో నూజివీడు మండలం తుక్కులూరు గ్రామస్ధుడు షేక్ రసూల్ భీ సదరుకు తనకు ప్రభుత్వం వారు జగనన్న గృహం నిర్మించుకోవడానికి స్ధలం మంజూరు చేశారని సదరు ఇంటిని నిర్మించుకోవడానికి సిద్ధం అవుతుండగా అక్కడ బడిపాటి విజయలక్ష్మి ఆనే అగన్ వాడీ టీచరు తన స్ధలంలోకి వెళ్లనీయకుండా దారికి అడ్డువేసి నానా ఇబ్బందులకు గురిచేస్తుందని అధికారులు తమ స్ధలం ను పరిశీలించి తన ఇంటికి దారి సౌకర్యం కల్పించి ఇల్లు నిర్మించుకోవడానికి న్యాయం చెయ్యాలని అర్జీ అందజేశారు.
నూజివీడు మండలం జంగంగూడెం గ్రామ నివాసి పొట్లూరి అశోక్ తమ గ్రామమైన జంగంగూడెంలో గోపాలమిత్ర అనే అతను (ప్రసాద్) పనిచేస్తున్నాడని, పని ఇక్కడ నివాసం గన్నవరం అని నెలలో 10 రోజులు కూడా తమ గ్రామం వచ్చి పశువులకు ట్రీట్ మెంట్ చేయడంలేదని, అతను ప్రభుత్వం నుండి గౌరవవేతనం పొందుచున్నాడని గేదెలకు, ఆవులకు, మేకలకు, గొర్రెలకు గవర్నమెంటు వారు ఇచ్చిన వ్యాక్సిన్ కూడా వేయడంలేదని పశువుల డాక్టరుకు, అసిస్టెంట్ డైరెక్టరుకు ఫోన్ ద్వారా తెలిపినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఇక్కడ పనిచేస్తున్న గోపాలమిత్రపై చర్యలు తీసుకొని వేరే వ్యక్తిని ఇక్కడికి రప్పించమని కోరుతూ అర్జీ అందజేశారు.
నూజివీడు పట్టణం సమతానగర్ కాలనీ వాసులు గోవాడి కాంతారావు(ఎక్స్-ఆర్మి) సదరు ఇండియన్ ఆర్మిలో పనిచేసి రిటైరు అయి ఉన్నానని అప్పటి నుండి మాజీ సైనికులకు ప్రభుత్వం వారు కేటాయించే భూమిని ఇప్పిచవలసిందిగా ప్రభుత్వాధికారులకు ఎన్నో అర్జీలు పెట్టుకున్నానని, 2020 సంవత్సరంలో అప్పటి సబ్ కలెక్టరువారికి, ఆర్డివో వారికి అర్జీలు పెట్టినానని ఇంతవరకు ప్రభుత్వ భూమిని కేటాయించలేదని, మరియు ప్రభుత్వ ఆధీనంలో ఖాళీ భూమిలేదని ఒకవేళ మీరు ఎక్కడైనా ఉన్నట్లు తెలిపిన ఎడల పరిశీలించి కేటాయిస్తామని అధికారులు చెప్పారని కనుక గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామ పరిధిలో కోటగట్టు అనే కొండ రెవిన్యూ పోరంబోకు ఆర్.ఎస్. నెం. 1/1 లో భూమి ఉన్నట్లు తమకు తెలిసిందని దానినైనా తమకు కేటాయించాలని కోరుతూ అర్జీ అందజేశారు.
నూజివీడు పట్టణం రజికపేట నివాసులు కైతేపల్లి పుష్పాల రాధాకృష్ణ యం.ఆర్.అప్పారావు కాలనీ లో య.0.01 1/2 సెంట్లు ఖాళీ స్ధలం కొందరు అమ్ముతుండగా కొనుకున్నానని తను ఇల్లు కట్టుకోవడానికి సిద్దం అవుతుండగా గుర్రాల పేటకు చెందిన షేక్ షకీల, అబ్దుల్ రహమాన్ అనే వారు ఈ స్ధలం మాదేనని దొంగ పత్రాలు పుట్టించి తను ఇల్లు కట్టకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారని తను కొన్న స్ధలానికి ప్రభుత్వం వారు పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు చేసి ఇవ్వాలని కోరుతూ అర్జీ అందజేశారు.
రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామ శివారు బూరుగగూడెం నివాసి పల్నాటి సూర్యనారాయణ రంగాపురం రెవిన్యూ పరిధిలో ఆర్.ఎస్. నెం. 262/1 లో య.2.00 సెంట్లు భూమి పూర్వార్జితంగా తమకు సంక్రమించిందని ప్రభుత్వానికి చెల్లించవలసిన అన్ని శిస్తులు కడుతున్నానని తన పేరున ఉన్న భూమికి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ పుస్తకం మంజూరు చేయలేదని రెవిన్యూ రికార్డుల్లో తన పేరున ఉన్న భూమిని నమోదు చేయమని అనేక సార్లు అర్జీలు పెట్టుకున్నానని ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ మరియు 1-బి అడంగళ్ ఇప్పించి రెవిన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.
నూజివీడు రెల్లిపేట నివాసి దలాయి మన్మదరావు పట్టణంలో పోతురెడ్డిపల్లి వెళ్లు దారిలో తమకు నాచిన్ చెరువు దగ్గర ఎకరం పొలం ఇచ్చి దానికి భీ-ఫారం పట్టా, పాస్ పుస్తకం కూడా ఇచ్చారని దానికి 1983 సంవత్సరం నుండి భూమిని సాగుచేసుకుంటున్నామని ఆ భూమి వర్షాలు వచ్చినపుడు నీటితో మునిగిపోతుందని దానిని మెరకచేయడానికి మట్టిని తోలుకుంటుంటే ఇరిగేషన్ శాఖ అధికారులు అడ్డుపడుతున్నారని ఇది చెరువు భూమి అని మట్టి తోలవద్దని చెబుతున్నారని దీనిపై ఆర్.డి.ఓ , తహశీల్దారు వారికి చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఈ భూమిని పండించుకొని బ్రతుకుతున్నామని దీనిపై అధికారులు తమకు న్యాయం చెయ్యాలని కోరుతూ అర్జీ అందజేశారు.
విస్సన్నపేట మండలం విస్సన్నపేట గ్రామ కాపురస్ధుడు దగ్గుల దాసు విస్సన్నపేట గ్రామ ఆర్.ఎస్. నెం. 293/1బి లో య.1.00 మరియు 293/2ఎ నందు 25 సెంట్లు భూమిని కొనుగోలు చేసియున్నానని రిజిష్ట్రేషన్ కోసం రిజిష్టర్ ఆఫీసును సంప్రదించగా అధి దేవాదాయ మరియు దర్మాదాయ శాఖ కు సంబంధించిన దేవాలయం భూమిగా చెప్పుచున్నారని తమ దగ్గర కొన్నా భూమికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని కావున రిజిష్టర్ కార్యాలయం నందు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న ఆర్.ఎస్. నెం. 293/1 ను పరిశీలించి తమకు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంచి తొలగించి తమ సమస్యకు పరిష్కారం చెయ్యాలని కోరుతూ అర్జీ అందజేశారు.
స్పందన కార్యక్రమంలో డివిజనల్ పరిపాలనాధికారి యం. హరనాధ్, ఇరిగేషన్ ఈ.ఈ. కె.ఎల్.ఎన్ . ప్రశాంతి, పంచాయతీరాజ్ అధికారి ఎం. బసవయ్య, డివిజనల్ కో-ఆపరేటివ్ ఆఫీసరు కె. భాస్కరరావు, అసిస్టెంట్ బి.సి. వెల్ఫేర్ అధికారి ఏ .దివ్య, హార్టికల్చర్ ఆఫీసర్ ఎం. రత్నమాల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *